
ఫైలో : ఫైలో అనే పదానికి గ్రీకులో ‘ఆకు’ అని అర్థం. ఇది చాలా పల్చగా ఉంటుంది. పేస్ట్రీల తయారీలో ఫైలోను ఎక్కువగా ఉపయోగిస్తారు. బాల్కన్ క్విజీన్‌లో వీటి వాడకం ఎక్కువ. ఫైలో డఫ్‌ను మైదాపిండి, నీళ్లు, కొద్దిగా నూనె లేదా వైట్ వెనిగర్ ఉపయోగించి తయారుచేస్తారు. ఈ షీట్లను వరుసగా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ, ఆయిల్ లేదా బటర్‌తో బ్రషింగ్ చేసి, అప్పుడే పేస్ట్రీని బేక్ చేస్తారు. ఇంటి దగ్గర చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇందుకోసం పెద్ద పెద్ద రోలింగ్ షీట్లు, పెద్ద టేబుల్, పెద్ద చపాతీ కర్ర అవసరమవుతాయి. అలాగే రెండు పొరల మధ్య పొడి పిండి వేస్తూనే ఉండాలి. అందువల్ల వీటిని ఇంటి దగ్గర తయారు చేసుకోవడం కష్టం. ఫైలోలను చక్కగా తయారుచేసే యంత్రాన్ని 1970లో కనిపెట్టారు. ఇవి ఇప్పుడు సూపర్ మార్కెట్‌లో విస్తృతంగా దొరుకుతున్నాయి. వీటి తయారీకి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి.
క్రీమ్ ఆఫ్ టార్టార్: ఈ పేరు చూడగానే క్రీమ్ అనుకోకూడదు. ఇది పొడిపొడిగా ఉంటుంది. ద్రాక్ష పళ్లను పులియబెట్టి, తయారుచేసిన వైన్ నుంచి తయారయ్యే బైప్రోడక్ట్ ఇది. శాస్త్రీయంగా దీనిని పొటాషియం బైకార్బొనేట్ అంటారు. కోడిగుడ్లను గిలకొట్టేటప్పుడు ఈ పొడిని కొద్దిగా జత చేస్తే, మిశ్రమం బాగా నురుగులా, మెత్తగా వస్తుంది.
షార్టెనింగ్: ఘనరూపంలో ఉన్న ఏదో ఒక ఫ్యాట్‌ని పేస్ట్రీలలో ఉపయోగిస్తారు. షార్టెనింగ్ అనే పదాన్ని మార్గరిన్‌కి దగ్గరగా ఉండే బటర్ పదానికి బదులుగా ఉపయోగిస్తారు.
కొబ్బరి ఫ్లేక్స్: కొబ్బరిని సన్నగా ముక్కలుగా తురమాలి. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక ఈ కొబ్బరి ముక్కలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి.
స్వీటెన్‌డ్ ఫ్లేక్‌డ్ కోకోనట్ : సన్నగా తురిమిన కొబ్బరి ముక్కలకు కొద్దిగా పంచదార జతచేసి బాగా కలపాలి. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక ఈ ముక్కలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. ఇవి సుమారు వారం రోజులు నిల్వ ఉంటాయి.
ఇదీ కేకు చరిత్ర: కేక్ అనే పదానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ పదం వికింగ్ దేశాలకు చెందిన పురాతన నార్స్ (స్కాండెనేవియా) పదం ‘కక’ నుంచి వచ్చింది. పురాతన గ్రీకులు కేక్‌ని ప్లకోస్ అని పిలిచేవారు. ఇది ఫ్లాట్ అనే పదం నుంచి పుట్టింది. కోడిగుడ్లు, పాలు, నట్స్, తేనెలను జత చేసి బేక్ చేసి తయారుచేసేవారు. గ్రీకులకు సతురా అనే ప్రత్యేకమైన కేక్ ఉండేది. అంటే ఫ్లాట్‌గా తయారుచేసిన హెవీ కేక్ అన్నమాట. రోమనుల కాలంలో ప్లాసెంటాను కేక్‌తో కలిపి బేక్ చేసేవారు. పేస్ట్రీల తయారీలో ఉపయోగించే వారు. వీరు మేకపాలను ఉపయోగించి చీజ్ తయారుచేసేవారు. పూర్వకాలంలో రోమన్లు బటర్, కోడిగుడ్లు, తేనె కలిపి బ్రెడ్ తయారీకి కావలసిన పిండిని తయారుచేసేవారు. ఇంగ్లండ్‌లో కూడా తొలినాళ్లలో బ్రెడ్‌నే కేక్‌గా ఉపయోగించుకునేవారు. స్పాంజ్‌కేకులు స్పెయిన్‌లో ప్రారంభమైనట్లు భావిస్తారు. కేకులు చాలా రకాలు ఉన్నాయి. బటర్ కేక్స్, స్పాంజ్ కేక్స్, చిఫాన్ కేక్స్, చాకొలేట్ కేక్స్, కాఫీ కేక్స్...
Comments
Please login to add a commentAdd a comment