Cake mixing
-
Cake Mixing: కేక్స్ మిక్స్..టేస్ట్ అదుర్స్..
డిసెంబర్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం నూతనోత్సాహాన్ని పుంజుకుంటుంది. ఒకవైపు ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ వేడుకలు, మరోవైపు క్రిస్మస్ సంబరాలతో నగరం అంతా పార్టీ మూడ్‌లో ఉంటుంది. ఇందులో భాగంగా నగరంలో ఇప్పటికే విభిన్న వేదికల్లో వినోద కార్యక్రమాలు, వేడుకలు మొదలయ్యాయి. కల్చరల్ డైవర్సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచే హైదరాబాద్‌లో సర్వమత సమ్మేళనంలో భాగంగా క్రిస్మస్ వేడుకలు సైతం ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కేక్ మిక్సింగ్ సందడి నెలకొంది. నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు ఇయర్ ఎండ్ వేడుకలకు కూడా సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించే కేక్ మిక్సింగ్పైనే ఈ కథనం.. నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా కేక్ మిక్సింగ్.. ట్రెండ్ కొనసాగుతోంది. మొదట్లో క్రిస్మస్ ఫ్రీ ఈవెంట్స్‌లో భాగంగా కేక్ మిక్సింగ్ నిర్వహించేవారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కేక్ మిక్సింగ్‌లో పాల్గొంటూ వినూత్న సంస్కృతికి నాంది పలుకుతున్నారు. నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్స్, రిసార్ట్స్, ఎన్జీవోలు, విద్యా వ్యాపార సంస్థల్లో, ఇతర ఎంటర్టైన్మెంట్ వేదికలుగా కేక్ మిక్సింగ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లలో పలువురు సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నోవోటెల్ హైదరాబాద్, గోల్కొండ హోటల్, తాజ్ కృష్ణ, తాజ్ వివంత వంటి ఫైవ్ స్టార్ హోటల్స్‌తో పాటు ఇతర వేదికల్లో కేక్ మిక్సింగ్ వేడుకలు మొదలై కొనసాగుతూనే ఉన్నాయి.సెలిబ్రిటీల సందడి.. నగర జీవన శైలిలో భాగమైన ఈ కార్యక్రమాలకు సెలిబ్రిటీల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. నిర్వాహకులు సైతం పలువురు సెలిబ్రిటీలు, సామాజికవేత్తలు, ఐకానిక్ వ్యక్తులను ఈ కేక్ మిక్సింగ్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆహా్వనిస్తూ నగరవాసులను తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది నగర వేదికగా ఇప్పటికే జరిగిన పలు వేడుకల్లో సినీ తారలు, సింగర్లు, స్పోర్ట్స్ స్టార్స్ పాల్గొని సందడి చేశారు.వివిధ రకాల డ్రై ఫ్రూట్స్.. ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా, కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ ప్రధానంగా నిర్వహిస్తారు. ఈ కేక్ మిక్సింగ్‌లో దాదాపు 25 రకాల డ్రై ఫ్రూట్స్, పలు రకాల స్పైసెస్, రం, బ్రాందీ, విస్కీ లాంటి లిక్కర్ కలుపుతారు. ఇందులో వాడే పదార్థాల మిశ్రమం మంచి పోషకాలతో ఆరోగ్య ప్రదాయిని గానూ ఉంటున్నాయి. ఈ మిశ్రమాన్నంతా కొద్ది రోజులపాటు సోక్ (పులియ బెట్టడం) చేసి ఆ తరువాత ఫ్లమ్ కేక్ తయారు చేస్తారు. పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా తయారు చేసిన ఈ ఫ్లమ్ కేక్ క్రిస్మస్ వేడుకల్లో అందరికీ ఫేవరెట్. కేక్ మిక్సింగ్‌లో చిన్నలు, పెద్దలు అందరూ కలిసి లిక్కర్‌తో డ్రై ఫ్రూట్స్ కలుపుతూ ఎంజాయ్ చేస్తారు.గ్రేప్ స్టాంపింగ్.. కేక్ మిక్సింగ్‌తో పాటు ఈ మధ్యకాలంలో గ్రేప్ స్టాంపింగ్ విరివిగా నిర్వహిస్తున్నారు. ఈ గ్రేప్ స్టాంపింగ్‌లో ఒక పెద్ద చెక్క బుట్టలో అధిక మొత్తంలో ద్రాక్ష పళ్లను వేసి సామూహికంగా వాటిని తొక్కుతూ ద్రాక్ష రసాన్ని తీసి దాని నుండి వైన్ తయారు చేస్తారు. ఈ వైన్ కూడా క్రిస్మస్ వేడుకల్లో ప్రధాన అంశమే ఇలాంటి సాంస్కృతిక వినోదపరమైన కార్యక్రమాలకు నగరంలోని యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా అమితాసక్తి చూపిస్తున్నారు. ఈ నెలలో వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకొని అందులో పాలుపంచుకుంటున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. నూతనోత్సాహం కోసం.. కేక్ మిక్సింగ్ కూడా మన జీవన పరమార్థాన్ని తెలిపే ఓ వేడుకే. ఈ కేక్ మిక్సింగ్ లో కలిపే డ్రై ఫ్రూట్స్ నట్స్ సుగంధద్రవ్యాల లాగే మన అందరి జీవితాలు కలుపుగోలుగా అందంగా ఉండాలని అర్థం. అంతేకాకుండా ప్రతి ఏడాదీ నూతనోత్సాహాన్ని అందించడానికి ముందస్తు వేడుక. నగరంలో ఈ మధ్యకాలంలో ఈ సంస్కృతికి ఆదరణ బాగా పెరిగింది. – ఎస్పీ శైలజ, ప్రముఖ సింగర్, (ఈ మధ్య జరిగిన ఓ కేక్ మిక్సింగ్ వేడుకలో భాగంగా). -
విజయవాడలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కేక్ మిక్సింగ్.. గ్రేప్ స్టాంపింగ్
నగరం విభిన్న సంస్కృతులకు కేంద్రం బింధువు అని ప్రతి ఒక్కరూ చెబుతారు. శతాబ్దాల గత చరిత్ర మొదలు ప్రస్తుత తరం అధునాతన జీవనశైలిని సైతం తనలో ఇముడ్చుకుని భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిగా విశేష ఆదరణ పొందిన కేక్ మిక్సింగ్ ఈవెంట్లను సైతం ఘనంగా నిర్వహిస్తోంది మన భాగ్యనగరం. ఈ నేపథ్యంలో నగరంలోని ఎయిర్పోర్ట్ నోవోటెల్ వేదికగా ఆదివారం కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. క్రిస్మస్ ఈవెంట్లకు రెండు నెలల ముందే మిక్సింగ్ మొదలైంది.. ఆ వివరాలు తెలుసుకుందాం.. క్రిస్మస్కి దాదాపు 2 నెలల ముందు కేక్ మిక్సింగ్ నిర్వహిస్తారు. కేక్ మిక్సింగ్ దాదాపు 25 రకాల డ్రైఫ్రూట్స్, రమ్, బ్రాందీ, వైన్ వంటి లిక్కర్లతో కలిపిన మిశ్రమాన్ని 2 నెలల పాటు సోక్ (పులియబెడతారు–ఫర్మంటేషన్) చేస్తారు. 60 రోజుల తరువాత ఈ మిశ్రమంతో ప్లమ్‌కేక్ తయారు చేస్తారు. క్రిస్మస్ వేడుకల్లో ఈ కేక్ చాలా స్పెషల్. క్రిస్మస్కు కొద్ది రోజుల ముందు కేక్ మిక్సింగ్ చేసి తయారు చేసే కేక్‌లలో రుచి, నాణ్యత ఉండదని నోవోటెల్ చెఫ్ అమన్న రాజు తెలిపారు. కనీసం 2 నెలలు లిక్కర్లో మాగిన డ్రైఫ్రూట్స్‌కు మంచి ఫ్లేవర్ అద్దుతుంది. గ్రేప్ స్టాంపింగ్ (కాళ్లతో ద్రాక్షలను తొక్కుతూ వైన్ తయారు చేయడం) కూడా ఇక్కడ ప్రత్యేకం. ఇది ఫ్రాన్స్‌కు చెందిన పురాతన పద్దతి, సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు. 13 ఏళ్ల నుంచి.. నోవోటెల్ ఆధ్వర్యంలో 2011 నుంచి కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇలా ప్రతి ఏడాది డిసెంబర్ మొదటి, రెండు వారాల్లో 2 వేల నుంచి 2,500 కేకుల వరకూ చేస్తాం. ఒక కిలో కేక్‌లో ఈ మిశ్రమాన్ని 30 శాతం మాత్రమే వినియోగిస్తాం, మిగతాది క్యారమిల్, ఎగ్, ఫ్లోర్ తదితరాలను వినియోగిస్తాం. వైన్ తయారీ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గ్రేప్ స్టాంపింగ్‌లో విదేశీయులు సైతం పాల్గొని సందడి చేశారు. – సుఖ్బీర్ సింగ్, నోవోటెల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్వహ్.. భారత్.. నగరం వేదికగా నిర్వహించే ఈ వేడుకల్లో ప్రతి యేటా పాల్గొంటాను. హైదరాబాద్, భారతీయ సంస్కృతి అంటే చాలా ఇష్టం. రష్యా నుంచి నగరానికి వచ్చే పర్యాటకులు చారి్మనార్, బిర్లా మందిర్‌ను తప్పకుండా సందర్శిస్తారు. నాకు ఇష్టమైన వేడుకల్లో ఈ కేక్ మిక్సింగ్ ముఖ్యమైనది. ఐదేళ్లుగా ఈ వేడుకలకు హాజరవుతున్నా. నా పిల్లలకు కూడా ఇక్కడి సంస్కృతిపై మక్కువ. – ఎలీనా, రష్యా -
మెర్క్యూర్ హోటల్ లో కేక్ మిక్సింగ్ సందడి
-
కెవ్వు కేకు.. రుచికరమైన జోవార్ క్యారట్ కేక్ తయారీ ఇలా!
క్రిస్మస్ వస్తోంది. కేక్ చేద్దామంటే అమ్మో మైదాతోనా... అని భయం. హెల్త్ కోసం అందరూ మిల్లెట్లు తింటున్నారు. మిల్లెట్లతో అన్నాలు, బిరియానీలు, బ్రేక్‌ఫాస్ట్‌లు, స్నాక్‌లు...ఎన్నో చేస్తున్నారు. మరి... కేక్‌లు చేయలేమా? ఎందుకు చేయలేం! ఇదిలో ఇలా చేయండి. కావలసినవి: జొన్న పిండి– కప్పు; బాదం పొడి– కప్పు; బనానా ప్యూరీ– కప్పు; క్యారట్ తురుము– కప్పు; బెల్లం పొడి– కప్పు; పాలు లేదా నీరు – అర కప్పు; వెన్న – 3 టేబుల్ స్పూన్లు; అవిసె గింజల పొడి – 3 టేబుల్ స్పూన్లు (రెండింతల నీరు వేసి కలపాలి); ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాల్చిన చెక్క పొడి – ఒక్కొక్కటి అర స్పూన్; బాదం పలుకులు– 10 (సన్నగా తరగాలి) తయారీ విధానం: ⇒ మందపాటి పెనంలో జొన్నపిండి వేసి సన్న మంట మీద దోరగా వేయించాలి. ⇒ మరొక పాత్రలో అవిసె గింజల పొడిని నీటితో కలిపి ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ⇒ ఆ తర్వాత జొన్నపిండిలో వెన్న, బనానా ప్యూరీ, అవిసె గింజల పేస్ట్ వేసి బాగా కలపాలి. ⇒ ఇందులో ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసి మళ్లీ కలపాలి. ⇒ ఇప్పుడు మిగిలిన పొడులు, క్యారట్ తురుము వేసి తగినంత నీరు లేదా పాలు వేస్తూ బాగా కలపాలి. ⇒ కేక్ మౌల్డ్‌కు వెన్న రాసి పైన కొద్దిగా జొన్న పిండిని చల్లాలి. ఇప్పుడు పై మిశ్రమాన్ని సమంగా సర్దాలి. పైన బాదం పలుకులు చల్లాలి. ⇒ ఇప్పుడు ఒవెన్‌ను 180 డిగ్రీలు వేడి చేసి మౌల్డ్‌ను లోపల పెట్టి 50 లేదా 60 నిమిషాల పాటు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత కేక్‌ను ముక్కలుగా కట్ చేయాలి. -
క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కల్తీ కేక్ తినడం వల్లే తండ్రీకొడుకులు మృతి
-
కేక్ మిక్సింగ్‌లో పాల్గొన్న నటి
-
క్రిస్మస్ కార్నివాల్
కేక్ మిక్సింగ్లే కాదు... చిన్నారుల ప్రియ నేస్తం శాంతాక్లాజ్... ఊరంతా షికారు తిప్పేందుకు గుర్రాలు... ఒంటెలు వచ్చేశాయి. నగరానికి అప్పుడే క్రిస్మస్ శోభను తెచ్చేశాయి. అబిడ్స్ స్టాన్లీ హైస్కూల్లో యంగిస్థాన్ ఫౌండేషన్ ఆదివారం నిర్వహించిన ‘కిస్మస్ కార్నివాల్’ వివిధ ఆశ్రమాలకు చెందిన 500 మంది అనాథ బాలల కేరింతలతో ఉత్సాహంగా సాగింది. రంగుల రాట్నం ఎక్కి గిర్రున తిరుగుతూ... ఎడారి ఓడలు, గుర్రాలపై స్వారీ చేస్తూ... శాంతాక్లాజ్‌తో కబుర్లు చెబుతూ పిల్లలు తమను తాము మరచిపోయారు. రాహుల్ కృష్ణన్ మాయాజాలం... జంపింగ్ హౌస్... బౌన్సింగ్ క్యాజిల్... సెలవు రోజున బుడతలు తెగ ఎంజాయ్ చేసేశారు. -
కెవ్వు.. కేకు
నగరంలో క్రిస్మస్ జోష్ అప్పుడే షురూ అయింది. స్టార్ హోటల్స్... ఫుడ్ కోర్టుల్లో కేక్ మిక్సింగ్‌ల సంబరం జోరందుకుంటోంది. మాసబ్ట్యాక్ హోటల్ గోల్కొండలో బుధవారం నిర్వహించిన ఈవెంట్లో నటి సోనియా ఉత్సాహంగా పాల్గొంది. జీడిపప్పు, బాదం, ఏలకులు, కర్జూరా, పిస్తా తదితర డ్రై ఫ్రూట్స్ దట్టించి... దానికి వైన్ జోడించింది. ఆమెతో పాటు ఈ ఈవెంట్‌కు ఎంపికైన అతిథులూ ఓ చేయి వేశారు. -
మధువొలకబోసి
సిటీలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. కేక్ మిక్సింగ్ సెరిమనీతో ఈ పండుగకు వెల్కమ్ చెప్తున్నారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోట ల్లో శనివారం కేక్ మిక్సింగ్ సందడిగా సాగింది. డ్రైఫ్రూట్స్‌లో వైన్ పోసి.. మిక్స్ చేశారు. ఈ కార్యక్రమంలో తాజ్ కృష్ణ సిబ్బంది.. హోటల్‌కు వచ్చిన అతిథులు ఇందులో ఉల్లాసంగా పాల్గొన్నారు.