ఈ కొత్త రుచులను ట్రై చేయండి. ఘుమ ఘుమలాడే వంటకాలతో మీ ఇంటిల్లిపాదిని ఆనందపరచండి.
షాహీ తుకడా
కావల్సినవి పధార్థాలు
మిల్క్ బ్రెడ్ స్లైసులు – ఆరు
పాలు – లీటరు
పంచదార – ఐదు టేబుల్ స్పూన్లు
యాలకులపొడి – అర టేబుల్ స్పూను
కుంకుమ పువ్వు – అరటీస్పూను
పిస్తా పలుకులు – ఐదు టీస్పూన్లు
బాదం పలుకులు – ఐదు టీస్పూన్లు
సుగర్ సిరప్
నీళ్లు – అరకప్పు
పంచదార – అరకప్పు
యాలకులు – రెండు
రోజ్ వాటర్ – అరటీస్పూను
గార్నిష్
బ్రెడ్‌స్లైసులు – మూడు
నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు
డ్రైఫ్రూట్స్ – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
►ముందుగా టేబుల్‌స్పూను పాలల్లో కుంకుమ పువ్వును నానబెట్టు కోవాలి.
►మందపాటి గిన్నెలో పాలు పోసి వేడిచేయాలి.
►పాలు మీగడ కట్టి, సగమయ్యాక, పంచదార, కుంకుమపువ్వు, యాలకుల పొడి, బాదం, పిస్తా పలుకులు వేసి, 5 నిమిషాలకొకసారి కలుపుతూ ఉండాలి. చిక్కబడిన తరువాత దించి పక్కనబెట్టుకోవాలి.
►ఇప్పుడు అరకప్పు పంచదార, నీళ్లు వేసి తీగపాకం వచ్చిన తరువాత రోజ్ వాటర్, యాలకులపొడి వేసి కలపాలి.
►ఈ పాకంలో బ్రెడ్ స్లైసులను వేసి నానబెట్టుకోవాలి.
►గార్నిష్ కోసం తీసుకున్న బ్రెడ్‌ను త్రికోణాకృతి ఆకృతిలో కట్ చేసి నెయ్యిలో బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు వేయించాలి.
►వీటిని కూడా పాకంలో 15 సెకన్ల పాటు ఉంచాలి.
►ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లో బ్రెడ్‌ముక్కలు వరుసగా పేర్చి, కాచి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని వాటిమీద పోసి, గార్నిష్ కోసం తీసుకున్న పదార్థాలను వేసి సర్వ్‌చేస్తే ఎంతో రుచికరమైన షాహీ తుకడ రెడీ.
ఖీమా పన్నీర్
కావల్సినవి పధార్థాలు
పన్నీర్ తురుము – కప్పు
బటర్ – మూడు టేబుల్ స్పూన్లు
ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు
జీలకర్ర – అర టీస్పూను
లవంగాలు – రెండు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
యాలకులు – రెండు
బిర్యానీ ఆకు – ఒకటి
మిరియాలు – మూడు
ఉల్లిపాయలు – రెండు (సన్నగా తరగాలి)
టొమోటో – రెండు (సన్నగా తరుక్కోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను
పచ్చిమిర్చి – ఒకటి (సన్నగా తరగాలి)
కారం – రెండు టీస్పూన్లు
పసుపు – పావు టీస్పూను
ధనియాల పొడి – టీస్పూను
గరం మసాలా పొడి – అరటీస్పూను
కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
పంచదార – అరటీస్పూను
నిమ్మరసం – టీ స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం
►ముందుగా స్టవ్ మీద బాండీ వేడెక్కిన తరువాత బటర్, నూనె వేయాలి. రెండూ వేడయ్యాకా జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి నిమిషం వేయించాలి.
►తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడనివ్వాలి.
►ఉల్లిపాయ వేగాక, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టొమోటో, కొత్తిమీర తరుగు వేసి కలిపి మగ్గనివ్వాలి.
►టొమోటో మగ్గాకా.. పసుపు, కారం, ధనియాల పొడి వేసి సన్నని మంటమీద తిప్పుతూ ఉండాలి.
►ఆయిల్ పైకి తేలిన తరువాత పన్నీర్ తురుము, గరం మసాలా, పంచదార, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి .
►ఇప్పుడు మూతపెట్టి మూడు నిమిషాల ఉడికించి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేస్తే ఖీమా పన్నీర్ రెడీ.
చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..!
Comments
Please login to add a commentAdd a comment