నందిగామ: నేతిబీరకాయకూ ఓ రోజొచ్చింది. మామూలు రోజుల్లో దీనిని అడిగే నాథుడే ఉండడు. కానీ ఏడాదిలో ఒక్కరోజు మాత్రం అది ఈరోజు నాది అని సగర్వంగా చెప్పుకుంటుంది. కార్తిక పౌర్ణమి నేపథ్యంలో పట్టణంలో నేతిబీరకాయకు డిమాండ్ పెరిగింది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో నేతి బీరకాయలు విరివిగా దర్శనమిచ్చేవి.
చదవండి: Visakhapatnam: ఆ ఊహలన్నీ త్వరలోనే నిజం కానున్నాయి..
కాలక్రమంలో ఇవి కనుమరుగు కావడంతో మార్కెట్‌లో వీటి లభ్యత అరకొరగానే ఉంటోంది. అయితే, కార్తికపౌర్ణమి రోజున నేతి బీరకాయతో వంటకాలు రుచి చూడటం ఎంతో శ్రేష్టమని ప్రజలు భావిస్తారు. దీంతో గురువారం నందిగామ మార్కెట్‌లో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని అమ్మకందారులు ఒక్కో కాయను రూ.50 చొప్పున విక్రయించడం గమనార్హం.
చదవండి: ఎక్కడి నుంచి వచ్చిందో ఆ యువతి.. ఆకతాయిలు వేధిస్తుండడంతో..
Comments
Please login to add a commentAdd a comment