బీరకాయ అనగానే ‘అబ్బా.. ఇపుడది తినాలా’ అంటారు పిల్లలు. పెద్దల్ల కూడా చాలామంది బీరకాయ తినడానికి ఇష్టపడరు. కానీ బీరకాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మన పెద్దలనాటి నుంచి అనారోగ్యం నుంచి కోలుకున్న వారికి, బాలింతలకు బీరకాయ ఎక్కువ పెడతారు. దీనికా కారణం ఏమిటంటే.. కోలుకోవడానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. తేలిగ్గా జీర్ణం అవుతుంది కూడా. బీరకాయల్లో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రొటీన్ పవర్‌హౌస్. బీరకాయ. అందుకే ఆయుర్వేద వైద్యంలో ఫంగల్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ, సహా వివిధ పరిస్థితులకు చికిత్సగా చాలా కాలంగా వాడుతున్నారు.
బీరకాయలో వాటర్, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ, సీ, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం లభిస్తాయి. ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. బీరకాయలో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నొప్పి, అలసట వంటి లక్షణాలను తగ్గిస్తుంది. దీంతో రక్తహీనత దరి ఉండదు.
బీరకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బీరకాయలో సెల్యులోజ్, డైటర్ ఫైబర్ కూడా లభిస్తుంది. బీరకాయను తినడంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. మలబద్దకం దూరం అవుతుంది. శరీరంలోని టాక్సిన్లను బయిటకు పంపించడంలో బీరకాయ సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుద్ది చేస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది.
బీరకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు నిజానికి పెప్టిక్ అల్సర్‌లను ఎదుర్కోవడంలో సహాయ పడతాయి. విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం పోషకాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
బీరకాయ వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇందులోని పొటాషియం, సోడియం, జింక్, రాగి, సెలీనియం శరీరంలోని యాసిడ్స్‌ను నియంత్రిస్తాయి.
బీరకాయ రసంతో తయారు చేసిన హోమియోపతిక్ మాత్రలను సైనసైటిస్ లక్షణాల నుండి ఉపశమనం కోసం వాడతారట.
బీరకాయలో జింక్, ఐరన్, పొటాషియం విటమిన్లతో పాటు ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి. బీరకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మూత్రంలోని చక్కెర స్థాయిలను సైతం తగ్గించేందుకు సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి
అల్సర్లు , అజీర్ణం చికిత్సకు కూడా సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను పెప్టిక్ అల్సర్‌లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. వాటర్‌కంటెంట్ ఫైబర్ ఎక్కువ, కొవ్వు తక్కువ కాబట్టి బరువు తగ్గడంలో కూడా గణనీయంగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
బీరకాయను ఎన్ని రకాలుగా వండుకోవచ్చు
కంది పప్పుతో కలిపి బీరకాయ పప్పును తయారు చేసుకోవచ్చు
పెసరపప్పుతో, శనగపప్పుతో కలిపి పొడి కూరలాగ వండుకోవచ్చు
గానుగ నూనెతో చేసిన బీరకాయ కూరను బాలింతకు, పేషెంట్లకు పెట్టవచ్చు
బీరకాయ, పాలు కూర వండుకోవచ్చు
బీరకాయను పచ్చడిగా చేసుకోవచ్చు.
బీరకాయను కూర చేసుకొని, తొక్కలతో పచ్చడి చేసుకోవచ్చు.
బీరకాయతో బజ్జీలు కూడా తయారు చేసుకోవచ్చు
అంతేకాదు బీరకాయ, ఎండురొయ్యలతో కూడా రుచికరమైన కూరను వండుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment