దసరా పండగ వేళ.. రొటీన్‌కు కాస్త భిన్నంగా సరికొత్త, ఘుమఘుమలాడే వంటకాలను బంధువులు, స్నేహితులు, ఇంట్లో వాళ్లకు రుచి చూపిద్దాం...
స్వీట్ పనియారం
కావల్సిన పదార్థాలు:
►గోధుమ పిండి – కప్పు
►అరటిపళ్లు – రెండు
►బియ్యప్పిండి – రెండు టేబుల్ స్పూన్లు
►పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు
►బెల్లం – అరకప్పు
►నీళ్లు – అరకప్పు
►యాలకులపొడి – అరటీస్పూను
►నెయ్యి – టీస్పూను
తయారీ విధానం..
►అరకప్పు నీటిని వేడి చేసి, దానిలో బెల్లం వేసి కరిగించి పక్కనబెట్టుకోవాలి.
►ఒక గిన్నెలో రెండు అరటిపళ్లను తొక్కతీసి గుజ్జులా చేసుకోవాలి.
►ఇప్పుడు అరటిపండు గుజ్జులో బెల్లం సిరప్‌ను వడగట్టి పోయాలి. ఈ మిశ్రమానికి కొబ్బరి తురుము, యాలకుల పొడి, గోధుమపిండి, బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా, ►దోశ పిండిలా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకోవచ్చు.
►ఇప్పుడు పొంగనాలు లేదా ఇడ్లీ పాత్రకు కొద్దిగా నెయ్యిరాసి, పిండి మిశ్రమాన్ని వేసి, మూతపెట్టి 15 నిమిషాలు ఉడికించిన తరువాత, మరోవైపు తిప్పి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికిస్తే స్వీట్ పనియారం రెడీ.
ఆలూ కా హల్వా
కావల్సిన పదార్థాలు:
►ఉడికించి తొక్కతీసిన బంగాళ దుంపలు – ఆరు (తురుముకోవాలి)
►నెయ్యి – అరకప్పు
►పాలు – కప్పు
►పంచదార పొడి – ఒకటిన్నర కప్పు
►యాలకుల పొడి – టీ స్పూను
►డ్రైఫూట్స్ పలుకులు – అరకప్పు
తయారీ విధానం..
►స్టవ్ మీద మందపాటి బాణలిని పెట్టి, వేడెక్కిన తరువాత కొద్దిగా నెయ్యి వేసి బంగాళ దుంపల తురుము వేసి దోరగా వేయించాలి.
►తురుము వేగాక పాలు, పంచదార పొడి వేసి కలపాలి.
►పంచదార పొడి పూర్తిగా కరిగిన తరువాత, మిగతా నెయ్యి వేసి తిప్పుతుండాలి.
►నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించి, యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్ పలుకులు వేస్తే పొటాటో హల్వా రెడీ.
Comments
Please login to add a commentAdd a comment