Usiri
-
ఉసిరి లడ్డూ కావాలా నాయనా!
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): ఉసిరి లడ్డూ కావాలా నాయనా... ఉసిరి క్యాండీతో ఎంజాయ్ చెయండి అంటున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషివిజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందిన కొందరు ఔత్సాహికులు. రాతి ఉసిరి అంటే పచ్చడి మాత్రమే అందరికి తెలుసు. కాలక్షేపానికి ఒకట్రెండు కాయలు తినేందుకో, వైద్యానికో వినియోగిస్తారు. ఇప్పుడు ఆర్గానిక్స్ పేరుతో ఉసిరి లడ్డూలు, ఆమ్లా మురబ్బా, ఆమ్లా హనీ, చట్పటా (కాలక్షేపానికి తినడానికి)తయారు చేస్తున్నారు. సహజసిద్ధమైన ఉసిరి పులుపు రుచికి తేనెను చేర్చి కొత్త రుచులు తీసుకొస్తున్నారు. ఉసిరిని హనీ లడ్డూగా మారుస్తున్నారు. ఆర్యతో కొత్త అడుగు : యువతను వ్యవసాయం వైపు ఆకర్షించి వారిని ఆ రంగంలో నిలదొక్కుకొనేందుకు తీసుకొచ్చిన పథకం ఆర్య(అట్రాకింగ్ అండ్ రీటెనియింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్). ఇందులో ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్, తేనెటీగల పెంపకం, పెరటికోళ్ల పెంపకం, సమీకృత వ్యవసాయం ఉన్నాయి. ఫ్రూట్ అండ్ విజిటబుల్ ప్రాసెసింగ్, తేనెటీగల పెంపకాన్ని సమ్మిళితం చేసిన ప్రయోగానికి ప్రతిరూపమే ఉసిరి లడ్డూలు, మురబ్బాలు. కృషి విజ్ఞాన కేంద్రంలోని శిక్షణను అందిపుచ్చుకున్న పెదతాడేపల్లి గ్రామానికి చెందిన కొందరు మహిళలు మధుశ్రీ ఆర్గానిక్స్ పేరుతో ఉసిరి యూనిట్‌ను ప్రారంభించారు. దీంతో ఉసిరి లడ్డూలు ఇతర ఉత్పత్తులు మార్కెట్లోకి గత 6 నెలలుగా వస్తున్నాయి. ఉసిరి లడ్డూ తయారీ ఇలా.. ఉసిరి కాయలను తీసుకొని తేమ 20 శాతం ఉండేలా చూస్తారు. తేనెలో 72 నుంచి 80 వరకు బ్రిక్స్ (చక్కెర శాతం )ఉండేలా చూస్తారు. 72 గంటల పాటు తేనెలో ఉసిరి కాయలు నాననిచ్చి మాగపెడతారు. తర్వాత ఆరబెడతారు. ఇలా తయారయ్యిన ఉసిర లడ్డూలు ఏడాది పాడవకుండా ఉంటాయి. గ్రేడింగ్‌లో తీసేసిన కాయలతో ఆమ్లా మురబ్బా( తొనలు) తయారు చేస్తారు. ఉసిరి కాయలకు ఉప్పును చేర్చి చట్పటా తయారు చేస్తారు. పరిశ్రమను మరింత విస్తరిస్తాం ఉసిరితో ఉత్పత్తులను తయారుచేసే విషయంపై ఐదుగురం శిక్షణ పొందాం. ఏడు నెలల క్రితం ఉత్పత్తులు ప్రారంభించాం. జిల్లాతో పాటు కర్నూలు, వైజాగ్, హైద్రాబాద్ వంటి ప్రాంతాలకు ఉత్పత్తులు పంపించి వ్యాపారం చేస్తున్నాం. పరిశ్రమను అన్ని హంగులతో విస్తరించే యోచనలో ఉన్నాం. – గీతాంజలి, మధుశ్రీ ఆర్గానిక్స్, పెదతాడేపల్లి -
రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల
ఏ విద్యలో అయినా ఫలానా వారు బాగా నిష్ణాతులు అని చెప్పడానికి వారికి అది కరతలామలకం అని అనడం తెలుసు కదా... ఆమలకం అంటే ఉసిరికాయ. కరతలం అంటే అరచేయి. అంటే అరచేతిలో ఉసిరికాయలా అని అర్థం. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, అరచేతిలో ఉసిరికాయ ఉంటే అది ఎన్నో ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంలా పని చేస్తుందని. అవేమిటో చూద్దాం. ►ఊపిరితిత్తుల వ్యాధులకు ఉసిరిని మించిన మందు మరొకటి లేదని అనుభవజ్ఞులు చెబుతుంటారు. ►రోజూ ఓ ఉసిరికాయని తింటే శ్లేష్మ సమస్యలన్నీ తొలగిపోతాయి. కంటి సమస్యలకి ఉసిరి చాలా మంచిది. ►ఉసిరికాయల్ని ముద్దగా చేసి తలకి పట్టిస్తే కళ్ల మంటలు తగ్గుతాయట. ►ముఖ్యంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా చేయడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడకుండా ఉంటుంది. ►ఆయుర్వేదమే కాదు, అల్లోపతీ కూడా ఉసిరిని ఔషధ సిరి అని కొనియాడుతుంది. ఎందుకంటే ఉసిరిలోని యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్ గుణాల వల్ల రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. ఇందులో ఉండే క్రోమియం ఇన్సులిన్ స్రావాన్ని పెంచడం ద్వారా చక్కెర నిల్వల్ని తగ్గించి హృద్రోగాలూ మధుమేహం... వంటివి రాకుండా అడ్డుకుంటుందనీ తేలింది. కొన్నిరకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఉసిరికి ఉన్నాయి. ►రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు అనేకం. అందుకే మన దేశంలో అధికంగా పండే ఉసిరిని పొడి, క్యాండీలు, రసం, ట్యాబ్లెట్ల రూపంలో నిల్వచేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. కురులకు ఉ‘సిరి’ ►కురుల సంరక్షణకు ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. రోజూ తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదుళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతో బాటు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఉసిరితో చేసే షాంపూలూ నూనెలూ జుట్టుకి బాల నెరుపునీ చుండ్రునీ తగ్గిస్తాయి. అలాగే ఇందులోని సి–విటమిన్ ఎండ నుంచీ, చర్మరోగాల నుంచీ కాపాడటమే కాదు, శరీరానికి మంచి మెరుపునీ ఇస్తుంది. ►రోజూ ఓ ఉసిరికాయని తింటే కాల్షియం ఒంటికి పట్టడం పెరుగుతుంది. దాంతో ఎముకలూ, దంతాలూ, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే మరి... తాజాగా, ఎండు పండుగా, ట్యాబ్లెట్గా లేదా పొడి రూపంలో–ఎలా తీసుకున్నా ఉసిరి... అందాన్నీ ఆరోగ్యాన్నీ సంరక్షించే అద్భుత ఔషధ సిరి. చదవండి: Health Tips: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే... -
ఊరించే ఉసిరి రుచులు: పుల్లటి హల్వా, నోరూరే రసం తయారీ ఇలా..
కార్తీక మాసం ప్రారంభం కావడంతోనే నేనున్నాని గుర్తు చేస్తుంది... కాస్త వగరు, నొసలు ముడివడేలా చేసే పులుపు ఉసిరి. ఈ కాలంలో ఉసిరి తింటే ఎంతో మంచిది. విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే సీజనల్ ఫ్రూట్ అయిన ఉసిరిని రోజూ నేరుగా తినలేం కాబట్టి... వెరైటీగా ఎలా వండవచ్చో చూద్దాం. పుల్లటి హల్వా కావల్సిన పదార్ధాలు ఉసిరికాయలు – 20 నెయ్యి – అరకప్పు పంచదార – కప్పు ఆరెంజ్ ఫుడ్ కలర్ – చిటికెడు జీడి పప్పు – పది కిస్మిస్ – పది నీళ్లు – పావు కప్పు యాలకుల పొడి – టీస్పూను తయారీ విధానం ►ఉసిరికాయలను శుభ్రంగా కడిగి విత్తనాలు తీసేసి పేస్టులా చేయాలి. పేస్టుని, జ్యూస్‌ను వేరువేరుగా తీసి పక్కన బెట్టుకోవాలి. ►కిస్మిస్, జీడిపప్పుని నెయ్యిలో దోరగా వేయించి పక్కనబెట్టుకోవాలి. ►బాణలిలో ఉసిరిజ్యూస్, పావు కప్పు నీళ్లుపోసి మరిగించాలి. ►నీళ్లు బాగా మరిగాక ఉసిరిపేస్టు, పంచదార వేసి తిప్పాలి. ►పదినిమిషాలు కలుపుతూ ఉడికించిన తరువాత ఫుడ్ కలర్, నెయ్యి వేయాలి. ►ఐదు నిమిషాలు మగ్గాక జీడిపప్పు, కిస్మిస్లతో గార్నిష్ చేస్తే పుల్లని ఆమ్లా హల్వా రెడీ. చదవండి: Viral: తెలుసా! ఈ ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావట..! నోరూరే రసం కావల్సిన పదార్ధాలు ఉసిరి కాయలు – మూడు కందిపప్పు – రెండు టేబుల్ స్పూన్లు టొమాటో – ఒకటి చింతపండు రసం – రెండు టేబుల్ స్పూన్లు అల్లం – పావు అంగుళం ముక్క వెల్లుల్లి – రెండు రెబ్బలు మినప గుళ్లు – రెండు టీస్పూన్లు జీలకర్ర – అర టీస్పూను ఆవాలు – అరటీస్పూను మిరియాల పొడి – పావు టీస్పూను ఎండు మిర్చి – ఒకటి రసం పొడి – టీస్పూను ఉప్పు – రుచికి సరిపడా బెల్లం – చిన్న ముక్క పసుపు – పావు టీస్పూను కరివేపాకు – రెండు రెమ్మలు ఇంగువ – చిటికెడు ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు తయారీ విధానం ►ముందుగా కందిపప్పుని కడిగి టొమాటో ముక్కలు వేసి ఉడికించి, రుబ్బి పక్కనబెట్టుకోవాలి. ►స్టవ్ మీద బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి మినపగుళ్లు, జీలకర్ర, మిరియాలు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించి పొడిచేసుకోవాలి. ►ఈ పొడిలో విత్తనాలు తీసిన ఉసిరికాయ ముక్కలు, తొక్కతీసిన అల్లం పేస్టు వేయాలి. ►ఇప్పుడు తాలింపు బాణలిలో ఆయిల్ వేడెక్కిన తరువాత..ఆవాలు, కరివేపాకు, దంచిన వెల్లుల్లిని వేసి వేగనివ్వాలి. ►తరువాత ఉసిరిపేస్టు, పసుపు, రసం పొడి వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ►ఇప్పుడు రుబ్బిన పప్పు, రసానికి సరిపడా నీళ్లు, చింతపండు రసం, బెల్లం, కొత్తిమీర వేసి మరిగిస్తే నోరూరే రసం రెడీ. చదవండి: Vidit Aatrey: అతిపెద్ద సోషల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘మీ షో యాప్’ తెర వెనుక కథ!! -
జ్ఞానానికి ప్రతీక ఉసిరి దీపం
సాక్షి, నిజామాబాద్ : సకల సౌభాగ్యాలు ప్రసాదించే కార్తీకమాసం మోక్షమాసంగా పేరు పొందింది. ఈ మాసంలో చేసే పూజలు కైలాస, వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో మాత్రమే పూజించే ఉసిరికాయను విష్ణు స్వరూపంగా భావించి పూజలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే ఉసిరిని ఈ మాసంలో తిన్నా, దీపాలతో ఆరాధించినా ఆరోగ్యభాగ్యం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్తీక మాసం ఆరంభం నుంచే జిల్లా కేంద్రంలో ఉసిరికాయ అమ్మకాలు జోరందుకున్నాయి. శివాలయాల్లో.. ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ, శివాలయాల్లో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని ఉదయం, సాయంత్రం భక్తులు ఉసిరి దీపారాధనలు చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లోని శివాలయాలతో పాటు భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్, పోచంపాడ్ తదితర ప్రాంతాల్లోని శివాలయాల్లో భక్తులు కార్తీక పూజలు చేస్తున్నారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఔషధ గుణాలు ఇవే.. ఉసిరిని ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇందులో క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, పాస్పర్స్, కార్బొహైడ్రేడ్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయని వారు చెబుతున్నారు. జ్ఞాపకశక్తిని, తెలివితేటలు పెంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేసుందని తెలుస్తోంది. ఉసిరిని పొడిగా లేదా ముక్కలుగా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు కొద్ది మోతాదులో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరెన్నో ఉపయోగాలు ఉసిరితో మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. శరీరంలోని వేడిని, జలుబు, కోరింత దగ్గును తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కడుపు, పేగులో మంటను అరికడుతుంది. అధిక దాహాన్ని అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఉసిరి కలిపిన నూనెను వాడితే జుట్టు నిగనిగలాడటంతో పాటు జుట్టు రాలటం ఆగుతుంది. దీంతో తయారు చేసిన టానిక్ వాడితే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. చర్మ రక్షణకు ఉసిరి చలికాలంలో వచ్చే చర్మవ్యాధులకు ఉసిరి దివ్యౌషధంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, చిన్నపిల్లల్లో ఎముకల సంరక్షణకు, మహిళల్లో రుతుక్రమం సక్రమంగా రావడానికి ఉసిరి సేవనం బాగా ఉపయోగపడుతుంది. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయాలని పెద్దలు చెబుతారు. – యోగా రాంచంద్రం, గాజుల్‌పేట జ్ఞానానికి ప్రతీక ఉసిరి దీపం చీకటి అజ్ఞానానికి, వెలుగు జ్ఞానానికి ప్రతిబింబం. పవిత్రమైన కార్తీకమాసం శివకేశవుల ఆరాధన విశేష పుణ్యాన్నిస్తుంది. తులసి, ఉసిరికోట ముందు దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలుగుతాయని కార్తీక పురాణం చెబుతుంది. ఈ మాసంలో ఉసిరికను పూజించటం వలన ఈ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరవని శాస్త్రాలు చెబుతున్నాయి. – తోక చంద్రమౌళి, వినాయక్‌నగర్ -
ఉహ్.. ఒహ్.. సిరి
కొరికితే ఉహ్ వండితే అహ్ తింటే ఒహ్ ఉసిరండీ.. దానికి సరిలేదండీ! ఉహ్.. ఒహ్.. ఉసిరి. ఉసిరికాయ జ్యూస్ కావలసినవి: ఉసిరికాయలు – 2; మిరియాలు – 2; జీలకర్రపొడి – అర టీ స్పూన్, కరివేపాకు – 1 రెబ్బ, ఉప్పు – 1/4 టీ స్పూన్, నీళ్లు – 1/2 లీటరు; తేనె – 1 టీ స్పూన్. తయారి: ∙ఉసిరికాయలను కడిగి గింజలు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు, మిరియాలు, జీలకర్రపొడి, కరివేపాకు, ఉప్పు వేసి నీళ్లు పోసి బాగా బ్లెండ్ చేయాలి ∙ఈ మిశ్రమాన్ని వడకట్టి, తేనె కలిపితే ఉసిరికాయ జ్యూస్ రెడీ. ఉసిరి, కీరా పెరుగు పచ్చడి కావలసినవి: చిలికిన పెరుగు – 2 కప్పులు; ఉసిరికాయలు – 4 (తురుముకోవాలి); తురిమిన కొబ్బరి – 1/4 కప్పు; కీర దోస – 1 (తురుముకోవాలి); ఆవాల నూనె – 2 స్పూన్స్, ఆవాలు – 1 టీ స్పూన్; కరివేపాకు – 1 రెబ్బ, ఉప్పు, రుచికి సరిపడ. తయారి: ∙ఒక గిన్నెలోకి ఉసిరి తురుము, కొబ్బరి తురుము, కీరా తురుము, చిలికిన పెరగు, ఉప్పు, వేసి బాగా కలుపుకోవాలి ∙చిన్న పాన్‌ను వేడి చేసి నూనె పోసి, ఆవాలు చిటపడలాడాక కరివేపాకు వేసి వేగిన తర్వాత తయారు చేసుకున్న మిశ్రమంలో కలుపుకోవాలి ∙పలావ్‌తో ఈ రైతా బాగుంటుంది. ఉసిరికాయ తొక్కు పచ్చడి కావలసినవి :ఉసిరికాయలు – 250 గ్రా; ఉప్పు – 40 గ్రా; పసుపు – 1/2 టీ స్పూన్, మెంతులు – 2 1/2 టీ స్పూన్స్, ఆవాలు – 2 1/2 టీ స్పూన్స్, పచ్చిమిర్చి – 12; ఎండుమర్చి – 12; ఇంగువ – 1/2 టీ స్పూన్, ఇంగువ – 1/2 టీ స్పూన్; నూనె – 1/4 కప్పు. కావలసినవి ∙ముందుగా ఉసిరికాయలు కడిగి, తడి లేకుండా బాగా తుడుచుకొని, గింజలు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి ∙మిక్సీ జార్లో ముక్కలు చేసిన ఉసిరికాయ ముక్కలు, పసుపు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ∙గ్రైండ్ చేసిన ఉసిరికాయ తొక్కుకు తగినంత ఉప్పు కలిపి గాజు సీసాలో కానీ, జాడీలో కాని 3 రోజుల పాలు ఉంచితే చక్కగా ఊరుతుంది ∙పచ్చిమిర్చి కడిగి, తడిలేకుండా చూసుకుని ముక్కలుగా చేసుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి నూనె పోసి ఆవాలు వేసి చిటపటలాడుతుండగా మెంతులు కూడా వేసి వేయించుకోవాలి ∙తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. నూనె లేకుండా వాడ్చి, ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. దీనికి ఉసిరికాయ తొక్కును వేసి మరోసారి గ్రౌండ్ చేసుకోవాలి ∙ఒక గిన్నెలోకి ఈ పచ్చడిని తీసుకుని చేతితో బాగా కలుపుకోవాలి ∙పోపులో మిగిలిన నూనె చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఉసిరి లడ్డు కావలసినవి: ఉసిరికాయలు – 250 గ్రా; పంచదార – 250 గ్రా; బాదం పొడి – 50 గ్రా; జీడిపప్పు పొడి – 25 గ్రా; నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్; యాలకుల పొడి – 1 టీ స్పూన్, జాజికాయ పొడి – 1/2 టీ స్పూన్. తయారి: ∙ముందుగా ఉసిరికాయలను కడిగి కుక్కర్లో నీళ్లు పోయకుండా, విజిల్, గ్యాస్కట్ పెట్టకుండా 7 నిమిషాలు ఉంచి తీసేయాలి (మైక్రోవేవ్‌లో అయితే మాక్సిమమ్ టెంపరేచర్లో 5 నిమిషాలు సరిపోతుంది) ∙వేడిచేసిన ఉసిరికాయలను పూర్తిగా చల్లారిన తర్వాత తురుముకోవాలి ∙స్టౌ పైన నాన్‌స్టిక్ పాన్ పెట్టి ఉసిరి తురుము, పంచదార వేసి కలుపుతూ ఉండాలి ∙పంచదార పూర్తిగా కరిగి చిక్కటి పాకం వచ్చాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ∙ఒక బౌల్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని, బాదం పొడి, జీడిపప్పు పొడి, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి బాగా కలిసేవరకు కలుపుకోవాలి ∙అరచేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లా మనకు కావలసిన సైజులో చేసుకోవాలి ∙ఈ లడ్డు ఎయిట్టైట్ కంటెయినర్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచుకుంటే 4 నెలల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. ఉసిరికాయ గోరుచిక్కుడుకాయ కూర కావలసినవి: గోరుచిక్కుడు – 1/2 కేజి; ఉసిరికాయలు –2; పచ్చిమిర్చి – 2; ఆవాలు–1 టీ స్పూన్, జీలకర్ర – 1 టీ స్పూన్; ధనియాల పొడి – 1 టీ స్పూన్, కరివేపాకు – 1 రెబ్బ; పసుపు – 1/2 టీ స్పూన్, ఇంగువ – చిటికెడు; ఉప్పు – రుచికి సరిపడ; నూనె – 3 టేబుల్ స్పూన్స్. తయారి: ∙గోరుచిక్కుడుకాయలు కడిగి సగానికి తరిగి పెట్టుకోవాలి ∙ఉసిరికాయలను తురిమి పెట్టుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, తరిగిన పచ్చిమిర్చి, తురిమిన ఉసిరికాయ వేసి వేయించుకోవాలి ∙ఇప్పుడు తరిగిన గోరుచిక్కుడు కాయలు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి కొంచెం నీళ్లు చల్లి సిమ్‌లో పెట్టి ఉడకనివ్వాలి. పుల్లపుల్లటి ఉసిరి–గోరుచిక్కుడుకాయ కూర రెడీ. ఉసిరికాయ పులిహోర కావలసినవి: బియ్యం – 1/2 కేజీ (ఉడికించి చల్లార్చి పెట్టుకోవాలి); ఉసిరికాయలు – 3; పచ్చిమిర్చి – 4, కరివేపాయకు – 2 రెబ్బలు; – కొత్తిమీర – గుప్పెడు; వేరుశెనగగుళ్లు – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – 1 టీ స్పూన్, జీలకర్ర – 2 టీ స్పూన్, పచ్చిశెనగపప్పు – 2 టీ స్పూన్స్, మినపప్పు – 1 టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఉప్పు – రుచికి సరిపడ, నూనె – 4 టేబుల్ స్పూన్స్. తయారి: ∙ఉసిరికాయలు కడిగి గింజలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ∙మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కొంచెం ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ∙స్టౌ పై బాణలి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశెనగపప్పు, మినపప్పు, వేరుశెనగగుళ్లు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి ∙తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ కొత్తిమీర మిశ్రమాన్ని, పసుపు వేసి మరికాసేపు వేగనివ్వాలి ∙ఉసిరికాయ మిశ్రమం కలిపిన తర్వాత ఎక్కువసేపు వేగనివ్వకూడదు. ∙వెంటనే అన్నం కూడా వేసి బాగా కలిపితే వేడి వేడి ఉసిరికాయ పులిహోర రెడీ. ఆరోగ్యఉసిరి ఒక టీ స్పూన్ ఉసిరిక పొడిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది.రోజుకు ఒక ఉసిరి కాయ తింటే (పచ్చడి, పొడి, రసం ఏ రూపంలోనైనా) దేహం శక్తిమంతంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియల వ్యవస్థ సక్రమమవుతుంది. రోజూ భోజనానికి ముందు ఒక గ్లాసు ఉసిరి రసం తాగితే దేహంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఇది మంచి చిట్కా.ఉసిరి జుట్టుకు టానిక్‌లాంటిది. క్రమం తప్పకుండా ఉసిరి తినే వాళ్లకు జుట్టు బాగా పెరుగుతుంది. చిన్న వయసులో జుట్టు తెల్లబడడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉండవు. వారానికి ఒకసారి ఉసిరి రసాన్ని నేరుగా జుట్టుకు, కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు కూడా వదులుతుంది. -
సిరులన్నీ...సరిపాళ్లలో...
వజ్రాలా? వైఢూర్యాలా? మరకతాలా? మాణిక్యాలా? గోమేధికాలా, పుష్యరాగాలా? పగడాలా, ముత్యాలా? ఇంద్రనీలాలా? పసిడి రజతాలా? ఏమున్నాయండీ... ఇంత చిన్న ఉసిరిలో!! మాట్లాడితే సిరులంటారు, సరిపాళ్లంటారు? అవునా? లేవంటారా? నిజంగానే లేవంటారా? ఆలోచించండి, ఉసిరిక్కాయ్ని నములుతూ ఆలోచించండి. ఆరోగ్యానికి పనికొచ్చేవన్నీ ఉన్నాయి. ఆహారానికి రుచినిచ్చేవన్నీ ఉన్నాయి. హాయిగా తింటూ, ఆరోగ్యంగా ఉంటే... అంతకు మించిన మహాభాగ్యం ఏముంది చెప్పండి? జిహ్వకు రుచిని, జీర్ణకోశానికి శుచినీ అందించే ఆమలకం రిచ్ కాక ఏమిటి? వెరీమచ్ కాక మరేమిటి? ఉసిరి రైస్ కావలసినవి: ఉసిరికాయలు - 10; బియ్యం - అర కేజీ; పసుపు - అర టీ స్పూను; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె - తగినంత; నువ్వులపొడి - 2 టీ స్పూన్లు; జీడిపప్పు - 10; పచ్చిమిర్చి - 4; ఎండుమిర్చి - 5; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర కట్ట - చిన్నది ; శనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను తయారి: ముందుగా అన్నం వండుకుని పెద్ద పాత్రలో ఆరబెట్టాలి ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పు వేసి ఉంచి, కొద్దిసేపయ్యాక దంచాలి. (ఉసిరికాయలు మరీ పెద్దగా ఉంటే తురుముకోవచ్చు) పాన్‌లో నూనె వేసి కాగాక పసుపు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి రెండు నిముషాలు వేయించాలి అందులోనే పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన లేదా తురిమిన ఉసిరికాయ ముద్ద వేసి దోరగా వేయించాలి రెండు మూడు నిముషాలు మీడియం మంట మీద ఉంచి వేయించి, దించేయాలి కొద్దిగా చల్లారిన తర్వాత అన్నంలో కలపాలి. ఆమ్లా కీ లౌంజీ కావలసినవి: ఉసిరికాయలు - పావు కిలో; నూనె - 2 టేబుల్ స్పూన్లు; పంచదార - టీ స్పూను; కారం - టీ స్పూను; పసుపు - అర టీ స్పూను; ధనియాలపొడి - 2 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; సోంపు - టీ స్పూను; ఇంగువ - చిటికెడు; ఎండుమిర్చి - 2, పచ్చిమిర్చి - 5 తయారి: ఉసిరికాయలను కుకర్‌లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి దించేయాలి చల్లారాక గింజలు వేరు చేసి, ముక్కలుగా కట్ చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి వేయించాలి సోంపు, ఇంగువ, ఎండుమిర్చి జత చేసి మరోసారి వేయించాలి ఉసిరి ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి టీ స్పూను పంచదార, టీ స్పూను నీరు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరోమారు కలిపి రెండు నిముషాలు ఉంచి దించేయాలి. ఆమ్లా స్క్వాష్ కావలసినవి: ఉసిరికాయలు - 2 కేజీలు; పంచదార - 2 కేజీలు; కుంకుమపువ్వు - కొద్దిగా; ఏలకులపొడి - టీ స్పూను; సోడియం బెంజోయిట్ - 4 టీ స్పూన్లు తయారి: ఉసిరికాయలను ఆవిరి మీద ఉడికించి, చల్లారాక గింజలను వేరు చేసి, ఉసిరికాయలను మెత్తగా పేస్ట్ చేయాలి ఒక పెద్ద పాత్రలో పంచదార, ఉసిరి పేస్ట్, కొద్దిగా నీరు వేసి మూత పెట్టి, స్టౌ మీద ఉంచి, చిక్కగా అయ్యేవరకూ ఉడికించాలి కుంకుమపువ్వు, ఏలకులపొడి జతచేసి ఒకసారి కలిపి దించేయాలి కొద్దిగా వేడి నీటిలో సోడియం బెంజోయిట్ను వేసి కలిపి, ఉసిరి స్క్వాష్‌లో వేసి కలిపి గాలిచొరని సీసాలో వేయాలి. ఆమ్లా రైతా కావలసినవి: ఉసిరికాయలు - 3; పచ్చిమిర్చి - 3 (సన్నగా పొడవుగా కట్ చేయాలి); కొబ్బరితురుము - కప్పు; పెరుగు - కప్పు; ఉప్పు - తగినంత; నూనె - టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఇంగువ - చిటికెడు; కరివేపాకు - 2 రెమ్మలు; ఎండుమిర్చి - 2 తయారి: ఉసిరికాయలను మెత్తగా ఉడికించి, చల్లారాక గింజలు తీసేయాలి మిక్సీలో ఉసిరికాయలు, పచ్చిమిర్చి, కొబ్బరితురుము వేసి మెత్తగా చేయాలి ఉప్పు, పెరుగు వేసి మరోమారు మిక్సీపట్టాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి ఒక గిన్నెలో పెరుగు మిశ్రమం, ఇంగువ వేసి బాగా కలిపి వేయించిన పోపు జతచేయాలి. ఉసిరి మసాలా పచ్చడి కావలసినవి: ఉసిరికాయలు - పావు కిలో; మెంతులు - 3 టేబుల్ స్పూన్లు; సోంపు - 3 టేబుల్ స్పూన్లు; ఇంగువ - పావు టీ స్పూను; కారం - 3 టీ స్పూన్లు; పసుపు - అర టీస్పూను; ఆవనూనె -2 టేబుల్‌స్పూన్లు; ఉప్పు - తగినంత తయారి: ఉసిరికాయలకు తగినంత నీరు జతచేసి సుమారు పది నిముషాలు ఉడికించాలి చల్లారాక గింజలు వేరు చేసి ఉసిరికాయలను పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేయాలి ఒక పాత్రలో ఆవనూనె, మెంతిపొడి, సోంపు, ఇంగువ, కారం, పసుపు, ఉప్పు వేసి కలపాలి ఉసిరికాయ ముక్కలు జత చేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని, తడి లేసి సీసాలో వేసి నాలుగు రోజుల పాటు ఎండలో ఉంచి తీసేయాలి ఈ ఊరగాయ సుమారు నెలరోజులు నిల్వ ఉంటుంది. విశేష ఉసిరి... విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఎండకి, వర్షాభావానికి కూడా పెరుగుతుంది. ఉసిరిని పెంచడానికి అన్ని నేలలూ అనువైనవే. వీటి గింజలు, ఆకులు, పూలు, వేళ్లు, బెరడు... అన్నిటినీ ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. ఈ చెట్టు 18 అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు పట్టడం లాంటివి రాకుండా కాపాడుతుంది. హెమరైజ్‌కి, లుకోమియా వ్యాధికి, గర్భసంచిలో రక్తస్రావం అరికట్టడానికి ఔషధంగా వాడతారు. ఉప్పులో ఎండబెట్టి నిల్వ చేసిన ఉసిరిముక్కను ప్రతిరోజూ బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. శరీరానికి చల్లదనాన్నిచ్చి మలమూత్రవిసర్జన సక్రమంగా జరుగుతుంది. చక్కెరవ్యాధిగ్రస్తులు దీనిని వాడితే రక్తంలోని చక్కెరను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తినిచ్చే మందులలో ఉసిరిని ఎక్కువగా వాడతారు. శరీరంలో ఉండే కొవ్వును తగ్గిస్తుంది. ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది. కాలేయంలో చేరిన మలినాలు, విషపదార్థాలను తొలగించి, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది. బాగా ముదిరిన కాయలను ఎండబెట్టి వాటి గింజలను వేరుచేసి, ఒక్కో గింజలను పగలగొట్టి, లోపల చిన్న పరిమాణంలో ఉండే ఆరు విత్తనాలను 12 గంటల పాటు నీటిలో నానబెట్టి, మునిగిన విత్తనాలను మాత్రమే నారుమళ్లలో విత్తుకోవాలి.