Dried Gooseberry Candy | How to make Amla Candy In Telugu - Sakshi
Sakshi News home page

ఉసిరి లడ్డూ కావాలా నాయనా! 

Published Sat, Mar 19 2022 10:25 AM | Last Updated on Sat, Mar 19 2022 12:51 PM

Enjoy With Gooseberry Candy - Sakshi

తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): ఉసిరి లడ్డూ కావాలా నాయనా... ఉసిరి క్యాండీతో ఎంజాయ్‌ చెయండి అంటున్నారు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషివిజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందిన కొందరు ఔత్సాహికులు. రాతి ఉసిరి అంటే పచ్చడి మాత్రమే అందరికి తెలుసు. కాలక్షేపానికి ఒకట్రెండు కాయలు తినేందుకో, వైద్యానికో వినియోగిస్తారు. ఇప్పుడు ఆర్గానిక్స్‌ పేరుతో ఉసిరి లడ్డూలు, ఆమ్లా మురబ్బా, ఆమ్లా హనీ, చట్‌పటా (కాలక్షేపానికి తినడానికి)తయారు చేస్తున్నారు. సహజసిద్ధమైన ఉసిరి పులుపు రుచికి తేనెను చేర్చి కొత్త రుచులు తీసుకొస్తున్నారు. ఉసిరిని హనీ లడ్డూగా మారుస్తున్నారు.  

ఆర్యతో కొత్త అడుగు : యువతను వ్యవసాయం వైపు ఆకర్షించి వారిని ఆ రంగంలో నిలదొక్కుకొనేందుకు  తీసుకొచ్చిన పథకం ఆర్య(అట్రాకింగ్‌ అండ్‌ రీటెనియింగ్‌ యూత్‌ ఇన్‌ అగ్రికల్చర్‌). ఇందులో ఫ్రూట్‌ అండ్‌ వెజిటబుల్‌ ప్రాసెసింగ్, తేనెటీగల పెంపకం, పెరటికోళ్ల పెంపకం, సమీకృత వ్యవసాయం ఉన్నాయి. ఫ్రూట్‌ అండ్‌ విజిటబుల్‌ ప్రాసెసింగ్, తేనెటీగల పెంపకాన్ని సమ్మిళితం చేసిన ప్రయోగానికి ప్రతిరూపమే ఉసిరి లడ్డూలు, మురబ్బాలు.  కృషి విజ్ఞాన కేంద్రంలోని శిక్షణను అందిపుచ్చుకున్న పెదతాడేపల్లి గ్రామానికి చెందిన కొందరు మహిళలు మధుశ్రీ ఆర్గానిక్స్‌ పేరుతో ఉసిరి యూనిట్‌ను ప్రారంభించారు. దీంతో ఉసిరి లడ్డూలు ఇతర ఉత్పత్తులు మార్కెట్లోకి గత 6 నెలలుగా వస్తున్నాయి.  

ఉసిరి లడ్డూ తయారీ ఇలా.. 
ఉసిరి కాయలను తీసుకొని తేమ 20 శాతం ఉండేలా చూస్తారు. తేనెలో 72 నుంచి 80 వరకు బ్రిక్స్‌ (చక్కెర శాతం )ఉండేలా చూస్తారు. 72 గంటల పాటు తేనెలో ఉసిరి కాయలు నాననిచ్చి మాగపెడతారు. తర్వాత ఆరబెడతారు. ఇలా తయారయ్యిన ఉసిర లడ్డూలు ఏడాది పాడవకుండా ఉంటాయి. గ్రేడింగ్‌లో తీసేసిన కాయలతో ఆమ్లా మురబ్బా( తొనలు) తయారు చేస్తారు. ఉసిరి కాయలకు ఉప్పును చేర్చి చట్‌పటా తయారు చేస్తారు. 

పరిశ్రమను మరింత విస్తరిస్తాం 
ఉసిరితో ఉత్పత్తులను తయారుచేసే విషయంపై ఐదుగురం శిక్షణ పొందాం. ఏడు నెలల క్రితం ఉత్పత్తులు ప్రారంభించాం. జిల్లాతో పాటు కర్నూలు, వైజాగ్, హైద్రాబాద్‌ వంటి ప్రాంతాలకు ఉత్పత్తులు పంపించి వ్యాపారం చేస్తున్నాం. పరిశ్రమను అన్ని హంగులతో విస్తరించే యోచనలో ఉన్నాం.  
– గీతాంజలి, మధుశ్రీ ఆర్గానిక్స్, పెదతాడేపల్లి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement