Gooseberry Candy
-
నోరూరించి ఉసిరితో మెంతి కుర్మా చేయండి ఇలా!
కావలసినవి: ఉసిరి కాయలు – పది మెంతిఆకు –రెండు కట్టలు పచ్చిమిర్చి – రెండు అల్లం – అంగుళం ముక్క వెల్లుల్లి రెబ్బలు – ఐదు ఉల్లిపాయలు – రెండు టొమాటోలు – రెండు నూనె – రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర – అర టీస్పూను సోంపు – అర టీస్పూను వాము – టీస్పూను ఇంగువ – చిటికెడు పసుపు – అర టీస్పూను గరం మసాలా – టీస్పూను ధనియాల పొడి – టీస్పూను జీలకర్ర – టీస్పూను కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం: ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఉడికించాలి. ఉడికిన తర్వాత గింజలు తీసేసి, పెద్దసైజు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిని సన్నగా తరగాలి. మెంతిఆకును కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో నూనెవేసి వేడెక్కనివ్వాలి. నూనె కాగిన తరువాత, మీడియం మంట మీద ఉంచి..జీలకర్ర, సోంపు, వాము వేయాలి. ఇవి చిటపటలాడాక పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు మగ్గనియ్యాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత టొమాటో ముక్కలు కొద్దిగా నీళ్లుపోసి మూతపెట్టి మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తరువాత మూత తీసి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు మగ్గిన తరువాత టొమాటో ముక్కలు చక్కగా మెత్తబడతాయి. ఇప్పుడు మెంతిఆకు తరుగు వేసి కలపాలి. సన్నని మంట మీద కలుపుతూ ఉంటే మెంతిఆకు ఇట్టే మగ్గిపోతుంది మెంతిఆకు మగ్గిన తరువాత గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడులు వేయాలి. వెంటనే ఉసిరికాయ ముక్కలను వేసి మసాలాలు ముక్కలకు పట్టేలా కలపాలి. చివరిగా రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనిస్తే మెంతి ఉసిరి కుర్మా రెడీ. చపాతీ, రోటీ, అన్నం, సలాడ్లోకి ఈ కుర్మా మంచి కాంబినేషన్. (చదవండి: -
ఉసిరి లడ్డూ కావాలా నాయనా!
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): ఉసిరి లడ్డూ కావాలా నాయనా... ఉసిరి క్యాండీతో ఎంజాయ్ చెయండి అంటున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషివిజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందిన కొందరు ఔత్సాహికులు. రాతి ఉసిరి అంటే పచ్చడి మాత్రమే అందరికి తెలుసు. కాలక్షేపానికి ఒకట్రెండు కాయలు తినేందుకో, వైద్యానికో వినియోగిస్తారు. ఇప్పుడు ఆర్గానిక్స్ పేరుతో ఉసిరి లడ్డూలు, ఆమ్లా మురబ్బా, ఆమ్లా హనీ, చట్పటా (కాలక్షేపానికి తినడానికి)తయారు చేస్తున్నారు. సహజసిద్ధమైన ఉసిరి పులుపు రుచికి తేనెను చేర్చి కొత్త రుచులు తీసుకొస్తున్నారు. ఉసిరిని హనీ లడ్డూగా మారుస్తున్నారు. ఆర్యతో కొత్త అడుగు : యువతను వ్యవసాయం వైపు ఆకర్షించి వారిని ఆ రంగంలో నిలదొక్కుకొనేందుకు తీసుకొచ్చిన పథకం ఆర్య(అట్రాకింగ్ అండ్ రీటెనియింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్). ఇందులో ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్, తేనెటీగల పెంపకం, పెరటికోళ్ల పెంపకం, సమీకృత వ్యవసాయం ఉన్నాయి. ఫ్రూట్ అండ్ విజిటబుల్ ప్రాసెసింగ్, తేనెటీగల పెంపకాన్ని సమ్మిళితం చేసిన ప్రయోగానికి ప్రతిరూపమే ఉసిరి లడ్డూలు, మురబ్బాలు. కృషి విజ్ఞాన కేంద్రంలోని శిక్షణను అందిపుచ్చుకున్న పెదతాడేపల్లి గ్రామానికి చెందిన కొందరు మహిళలు మధుశ్రీ ఆర్గానిక్స్ పేరుతో ఉసిరి యూనిట్‌ను ప్రారంభించారు. దీంతో ఉసిరి లడ్డూలు ఇతర ఉత్పత్తులు మార్కెట్లోకి గత 6 నెలలుగా వస్తున్నాయి. ఉసిరి లడ్డూ తయారీ ఇలా.. ఉసిరి కాయలను తీసుకొని తేమ 20 శాతం ఉండేలా చూస్తారు. తేనెలో 72 నుంచి 80 వరకు బ్రిక్స్ (చక్కెర శాతం )ఉండేలా చూస్తారు. 72 గంటల పాటు తేనెలో ఉసిరి కాయలు నాననిచ్చి మాగపెడతారు. తర్వాత ఆరబెడతారు. ఇలా తయారయ్యిన ఉసిర లడ్డూలు ఏడాది పాడవకుండా ఉంటాయి. గ్రేడింగ్‌లో తీసేసిన కాయలతో ఆమ్లా మురబ్బా( తొనలు) తయారు చేస్తారు. ఉసిరి కాయలకు ఉప్పును చేర్చి చట్పటా తయారు చేస్తారు. పరిశ్రమను మరింత విస్తరిస్తాం ఉసిరితో ఉత్పత్తులను తయారుచేసే విషయంపై ఐదుగురం శిక్షణ పొందాం. ఏడు నెలల క్రితం ఉత్పత్తులు ప్రారంభించాం. జిల్లాతో పాటు కర్నూలు, వైజాగ్, హైద్రాబాద్ వంటి ప్రాంతాలకు ఉత్పత్తులు పంపించి వ్యాపారం చేస్తున్నాం. పరిశ్రమను అన్ని హంగులతో విస్తరించే యోచనలో ఉన్నాం. – గీతాంజలి, మధుశ్రీ ఆర్గానిక్స్, పెదతాడేపల్లి