కావలసినవి: బీట్‌రూట్ రసం – 1 కప్పు, ఖర్జూరం – 10 (వేడి నీళ్లల్లో కడిగి.. కాసేపు నానబెట్టి, గుజ్జులా చేసుకోవాలి)
పంచదార – పావు కప్పుపైనే (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు)
నెయ్యి – పావు కప్పు, ఏలకులు – 2
జీడిపప్పు – 15 పైనే
ఫుడ్ కలర్ – కొద్దిగా (బీట్‌రూట్ కలర్)
తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. మంట చిన్నగా పెట్టుకోవాలి. కళాయి వేడికాగానే.. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని.. అందులో జీడిపప్పు దోరగా వేయించుకుని, పక్కన పెట్టుకోవాలి. అనంతరం కళాయిలో ఇంకాస్త నెయ్యి వేసి.. ఖర్జూరం గుజ్జు వేసుకుని తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా కలపాలి. తర్వాత సరిపడా పంచదార, బీట్‌రూట్ రసం, ఫుడ్ కలర్ వేసుకుని చిన్నగా గరిటెతో
తిప్పుతూ ఉడికించుకోవాలి. మళ్లీ కొద్దిగా నెయ్యి వేసుకుని.. తిప్పాలి. ఏలకులు, జీడిపప్పు వేసుకుని కలపాలి. మిగిలిన నెయ్యి మొత్తం వేసుకుని.. తిప్పుతూ దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లోపలంతా నెయ్యి రాసి.. ఆ మొత్తం మిశ్రమాన్ని.. దానిలోకి తీసుకోవాలి. కాస్త చల్లారాక నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment