న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభానికి సూచికగా శనివారం హల్వా వేడుక జరిగింది. నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో మంత్రి జైట్లీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక పాత్రలో హల్వా వండి తమ శాఖలోని ఉద్యోగులందరికీ పంచిపెట్టారు. 2018–19 బడ్జెట్ పత్రాల ముద్రణను ప్రారంభించామని ట్వీటర్ ద్వారా తెలిపారు.
సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమానికి బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకున్న ఉద్యోగులు, అధికారులతోపాటు ముద్రణ విభాగం ఉద్యోగులు హాజరవుతారు. ముద్రణ ప్రక్రియ ప్రారంభం అయ్యాక అక్కడి ఉద్యోగులెవరూ ఇళ్లకు వెళ్లరు. బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేదాకా కార్యాలయంలోనే ఉంటారు. వీరికి కుటుంబసభ్యులతో సంబంధాలు ఉండవు.
Comments
Please login to add a commentAdd a comment