టుస్కానీ: గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోవటం కోసం రకరకాలగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఒక రైతు మాత్రం విన్నూతనంగా అతి పెద్ద గుమ్మడియకాయను పండించి గిన్నిస్ రికార్డులో స్థానం దక్కించుకున్నాడు. అసలు ఎక్కడ జరిగింది ఏంటి చూద్దామా!.
(చదవండి: చూడ్డానికి పిల్ల...కానీ చెరుకు గడలను ఎలా లాగించేస్తుందో!)
వివరాల్లోకెళ్లితే.....టుస్కానీలోని చియాంటిలో రాడ్డా కమ్యూన్‌కు చెందిన రైతు స్టెఫానో కట్రుపి 2008 నుండి పెద్ద పెద్ద గుమ్మడికాయలను పెంచుతున్నాడు.
అతను సెప్టెంబర్ 26, 2021న పిసా సమీపంలోని పెక్సియోలీలో జరిగిన కాంపియోనాటో డెల్లా జుకోన్ గుమ్మడికాయ పండుగలో ఈ అతి పెద్ద గుమ్మడి కాయను ప్రదర్శనకు తీసుకు వచ్చాడు. అంతేకాదు ఈ గుమ్మడి కాయ కేవలం మార్చి నుంచే మొలకెత్తడం ప్రారంభించింది అని కట్రుపి చెబుతున్నాడు .
ఈ మేరకు కట్రుపి ఈ గుమ్మడి కాయ ఉత్పత్తి, నాణ్యత పరంగా పోటీకి సరిపోతుందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ ధృవీకరించిందని అన్నారు. ఈ క్రమంలో కట్రుపి మాట్లాడుతూ...వాతావరణ నియంత్రణ అనేది అంకురోత్పత్తి నుండి పంట వరకు కీలకమైన అంశం. అంతేకాదు మొక్కలు మంచిగా కాయలు కాయలంటే వేడి చేయడం, చల్లబరచడం, షేడింగ్ చేయడం, మంచు తుడవడం, అవసరమైనప్పుడు నీరు పోయడం వంటివి అవసరం, ” అని చెప్పాడు. అంతేకాదు 2020లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ ధృవీకరించిన బరువు, చుట్టుకొలతల్లో అతి పెద్ద జాక్ ఓలాంతర్న్ తర్వాత ఈ బరువైన గుమ్మిడికాయ నిలుస్తుందని స్పష్టం చేసింది.
(చదవండి: వాట్ ఏ ఎక్స్‌ప్రెషన్స్...ఎవ్వరికైనా నవ్వు రావల్సిందే....)
Comments
Please login to add a commentAdd a comment