సాధారణంగా గుమ్మడి కాయల్ని కూరగా చేసుకుంటాం. లేదా స్వీట్ చేసుకుంటాం. గింజల్ని పక్కన పారేస్తుంటాం. అయితే కరోనా మహమ్మారి తరువాత డ్రైఫ్రూట్స్, నట్స్‌తో పాటు గుమ్మడి గింజల వాడకం బాగా పెరిగింది. ఈ సీడ్స్‌లోని పోషక విలువలు మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయట. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు గుమ్మడికాయ విత్తనాల్ని తినకూడదు. ఎందుకలా? వాచ్‌దిస్ స్టోరీ..
గుమ్మడికాయ గింజలు చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇందులో కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, పొటాషియం, జింక్ లాంటి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. మధుమేహం, గుండె జబ్బులు, కండరాలు, ఎముకల నొప్పి నివారణకు ఉపయోగపడతాయి. హైబీపీని తగ్గిస్తాయి. వీటిని తింటే రుచికి రుచికితోపాటు శక్తికి శక్తిని అందిస్తాయి. వీటిల్లో ఏ సీ ఈ విటమిన్లతోపాటు, ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. (Chocolate Day Story: వాలెంటైన్స్ డే వీక్, స్వీటెస్ట్ డే.. ‘చాక్లెట్ డే’)
మంచిగా నిద్ర పట్టాలంటే గుమ్మడి గింజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేనా జుట్టు రాలడం, మొటిమలను నియంత్రించడంతోపాటు, చర్మ సంరక్షణకు కూడా ఏజెంట్లుగా పనిచేస్తాయి. వీటిల్లో జింక్ పుష్కలంగా ఉండటంతో బట్టతల సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే గాయాలను నయం చేయడంలో సహాయ పడుతుంది. చర్మాన్ని యవ్వనంగా, ముడతలు లేకుండా ఉంచుతుంది గుమ్మడి గింజల నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కెరోటిన్ ఉంటాయి. ఇంకా చర్మ సంబంధమైన దీర్ఘకాలిక మంటలు, బొబ్బలకు ఉపశమనం లభిస్తుంది.
గుమ్మడికాయ గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. ఇవి క్యాన్సర్, మూత్రాశయ ఇన్ ఫెక్షన్‌లు రాకుండా కాపాడతాయి. గుమ్మడి గింజలు ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లకు నిలయం. అందుకే ఇవి ఊబకాయాన్ని నిరోధిస్తాయి. ఇది స్క్రబ్, లోషన్ రూపంలో లేదా మసాజ్ చేసినప్పుడు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది. ఈ సీడ్స్ తినడం ద్వారా గుండె రక్త నాళాలు గడ్డలు రాకుండా నిరోధించవచ్చు. స్ట్రోక్ వంటి వివిధ గుండె సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ గింజల్లోని యాంటీ డయాబెటిక్ లక్షణం సుగర్‌ను అదుపులో ఉంచుతుంది.
గర్భవతులు తినవచ్చా?
అత్యంత పోషకాలతో ఈ సీడ్స్ గర్భధారణ సమయంలో వినియోగానికి పూర్తిగా సురక్షితమే. ఎలాంటి దుష్ప్రభావాలు ఇంతవరకు నమోదు కాలేదు. కానీ ఈ సమయంలో జాగ్రత్త వహించాలి. అసహనం, తలనొప్పి, కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, డమేరియా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. అలాగే గుమ్మడి గింజలు బీపీ సుగర్ లాంటి సమస్యలున్న గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మాత్రం డాక్టర్ల సూచన మేర తీసుకోవాలి. లోసుగర్ ఉన్నవాళ్లు లో-బీపీ సమస్య ఉన్నవారు తీసుకోకుండా ఉంటే మంచిది. ఈ విత్తనాలను మరీ ఎక్కువగా తింటే అజీర్ణ సమస్యలొచ్చే అవకాశం ఉందనేది గమనించాలి. ఇలా కొన్ని పరిమితులు తప్ప ఈ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment