
అమెరికన్లలో భారీ గుమ్మడికాయలకు ఉండే క్రేజ్ ప్రత్యేకమైంది. ఏటా అక్కడా గుమ్మడి కాయల ప్రపంచ చాంపియన్ షిప్ పోటీలు సైతం నిర్వహిస్తుంటారు

రికార్డుల కోసం భారీ గుమ్మడి కాయల సాగును చేపట్టే రైతులు కూడా ఉన్నారు. అలాంటి రైతుల్లో ట్రావిస్ జింజర్ అనే హార్టీకల్చర్ టీచర్ కూడా ఒకరు

ఇటీవలే దక్షిణ శాన్ ఫ్రాన్సిస్కోలోని హఫ్ మూన్ బేలో 51వ వరల్డ్ ఛాంపియన్ షిప్ పంప్ కిన్ వేఆఫ్ పోటీలలో తను పండించిన 1,121కిలోల గుమ్మడి కాయతో పాల్గొని ట్రావిస్ జింజర్ విజేతగా నిలిచారు

రెండో స్థానంలో నిలిచిన రైతు గుమ్మడి కాయ కంటే జింజిర్ పండించి తెచ్చిన గుమ్మడికాయ బరువు మూడు కిలోలు అదనంగా ఉండటంతో నిర్వాహకులు ఆయనను విజేతగా ప్రకటించారు

ట్రావిస్ జింజర్ పండించిన గుమ్మడి కాయ బరువు ప్రపంచ రికార్డు సాధించిన 1247 కిలోల గుమ్మడి కంటే కేవలం 126 కిలోలే తక్కువ

ఈ భారీ గుమ్మడికాయను తీసుకొని తన కుటుంబం మొత్తం 35 గంటలు ప్రయాణించి పోటీల వేదికకు చేరుకొన్నట్లు జింజిర్ వెల్లడించాడు


