ఆహ్లాదం.. ఆహ్వానం | Boat Racing In Vijayawada | Sakshi
Sakshi News home page

ఆహ్లాదం.. ఆహ్వానం

Published Thu, Nov 15 2018 1:41 PM | Last Updated on Thu, Nov 15 2018 1:41 PM

Boat Racing In Vijayawada - Sakshi

కృష్ణా నదిలో రేసు ముగిసే లైన్‌ వద్ద నిలిపిన బోట్లు

సాక్షి, విజయవాడ  :ఒక వైపు ఎఫ్‌1హెచ్‌2ఓ పవర్‌ బోట్‌ రేసింగ్‌ చాంపియన్‌ షిప్‌.. మరో వైపు గ్లోబల్‌ మ్యూజికల్‌ ఫెస్టివల్‌.. ఇంకో వైపు గగన విన్యాసాలు (ఎయిర్‌ షో).. మధ్యలో భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే శిల్పారామం ఎగ్జిబిషన్‌. వావ్‌.. ఇన్ని మెగా ఈవెంట్లను కొద్ది రోజుల తేడాలో ఒకే ప్రదేశంలో చూసే అవకాశం లభించటం చాలా అరుదుగా లభిస్తుంది కదూ. విజయవాడ నగర ప్రజలకు కనుల పండుగే. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన దేశాల్లో జరిగే ఎఫ్‌1హెచ్‌2ఓ పవర్‌ బోట్‌ రేసింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌లో అందునా అమరావతిని ఎంపిక చేయటం ఒక అదృష్టంగా చెప్పవచ్చు.  దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు రానున్న నేపథ్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నారు.

విజయవాడ నగరం ఆహ్లాదానికి కేరాఫ్‌గా మారి  ఆహ్వానిస్తోంది. పున్నమిఘాట్‌లో మూడు రోజులు పండు వెన్నెల కురియనుంది. శుక్రవారం నుంచి కృష్ణా నదిలో ఎఫ్‌1హెచ్‌2ఓ బోట్‌ రేసింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎయిర్‌షోకు వేదిక కాబోతోంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి ఎయిర్‌షో పారాచూట్‌లు బెజవాడకు చేరుకున్నాయి. నగరానికి కొత్త లుక్‌ తెచ్చిపెట్టాయి. సిద్ధమవుతున్న ఎఫ్‌1హెచ్‌2ఓ పార్క్‌ చిన్నారులకు సంతోషాలు పంచనుంది. మొత్తమీద పర్యాటకులకు కనువిందు అందబోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement