బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామ్ మాధవ్ నియమితులయ్యారు.
న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ మాజీ అధికార ప్రతినిధి రామ్ మాధవ్కు బీజేపీలో కీలక బాధ్యతలు అప్పగించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామ్ మాధవ్ నియమితులయ్యారు.
బీజేపీ అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ ప్రధాని బాధ్యతలు స్వీకరించాక పార్టీలో మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కేబినెట్లోకి తీసుకుని కీలక హోం శాఖ అప్పగించడంతో ఆయన స్థానంలో మోడీ ప్రధాన అనుచరుడు అమిత్ షాకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని భావిస్తున్నారు.