కేంద్ర మంత్రులు ఆర్ఎస్ఎస్తో చర్చలు జరపడటంలో తప్పులేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు ఆర్ఎస్ఎస్తో చర్చలు జరపడటంలో తప్పులేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ప్రజా సంస్థలతో సంబంధాలు కలిగిఉండటం మంచిదని అభిప్రాయపడ్డారు.
తమది సైద్ధాంతిక కుటుంబమని, దేశ శ్రేయస్సు కోసం చర్చలు జరిపామని రాంమాధవ్ చెప్పారు. ప్రభుత్వం సరైన దిశలో వెళ్తోందని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్కు ప్రజాస్వామ్యంపై నమ్మకంలేదని విమర్శించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టినా.. కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందనే నమ్మకంలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంపై కేంద్రం ముఖ్యమంత్రితో మాట్లాడుతోందని, ఎవరూ భావోద్వేగాలకు లోనుకావద్దని రాంమాధవ్ చెప్పారు.