న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ చట్టవిరుద్ధమైన సంస్థ కాదని, మంత్రులనూ ప్రశ్నిస్తుందని ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం ఆర్ఎస్ఎస్, బీజేపీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు, పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్గత భద్రత, సరిహద్దు సమస్యలపై చర్చించినట్టు చెప్పారు.
విద్యావిధానం ఆర్థికంగా, సాంఘికంగా అందుబాటులో ఉండాలని చెప్పినట్టు దత్తాత్రేయ వెల్లడించారు. 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామీణ, ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై చర్చిజరిగినట్టు తెలిపారు. మాజీ సైనికోద్యోగులకు వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విధానంపై మోదీ ఇచ్చిన మాటకు కట్టుబడిఉన్నారని దత్తాత్రేయ చెప్పారు.
'మంత్రులనూ ఆర్ఎస్ఎస్ ప్రశ్నిస్తుంది'
Published Fri, Sep 4 2015 5:57 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement