
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా మాజీ మంత్రి సి.రామచంద్రయ్య నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, సి.రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇటీవల విజయనగరం జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బలిజ సామాజిక వర్గానికి చెందిన సి.రామచంద్రయ్య విద్యావంతుడే కాక మంచి అధ్యయనశీలి, వక్త అనే పేరుంది.