సాక్షి, కడప: టీడీపీ ట్రాప్‌లో పడకుండా రాష్ట్ర్రానికి బీజేపీకి సహకరించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దివాళా తీసిన రాష్ట్రాన్నిముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఉన్నారని తెలిపారు. ఇసుక పాలసీ విధి విధానాలకు కొంత సమయం అవసరం అవుతుందని.. ప్రభుత్వం ఎలా నడుచుకోవాలో చెప్పే అర్హత చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. జమ్మూ కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దుకు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోనే మద్దతు నిచ్చామన్నారు.
ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చిన మోదీనే హోదాపై స్పష్టత నివ్వాలన్నారు. ఎకనామిక్ టెర్రరిస్టులను పార్టీలో చేర్చుకుంటే బీజేపీకి ఇబ్బందులు తప్పవన్నారు. నాడు బాబును తప్పుపట్టి ఇప్పుడు ఆ పార్టీకి చెందిన నేతలను బీజేపీలో చేర్చుకోవడం పద్దతి కాదన్నారు. రాజధాని విషయంలో కూడా చంద్రబాబు దళారులను పెంచి పోషించారని మండిపడ్డారు. అరాచక పనులను అరికట్టడం కోసమే అధికారంలోకి వచ్చామన్నారు. రాష్ట్రాభివృద్ది ఆగలేదని.. చంద్రబాబు దోపిడి మాత్రమే ఆగిందన్నారు. బాబు అనుమతి లేకుండానే.. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరారా అని ప్రశ్నించారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీని చంద్రబాబు.. రూపు లేకుండా చేశారన్నారు. రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు దగా చేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ వ్యవస్థను రూపుమాపామని తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment