ఏడోసారీ ఆమెకే బాధ్యతలు | AIADMK elects Jayalalithaa as the General Secretary for the 7th time | Sakshi
Sakshi News home page

ఏడోసారీ ఆమెకే బాధ్యతలు

Published Thu, Dec 31 2015 12:47 PM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

ఏడోసారీ ఆమెకే బాధ్యతలు

ఏడోసారీ ఆమెకే బాధ్యతలు

చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏడోసారి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆమెను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా 14 తీర్మానాలను అన్నాడీఎంకే ఆమోదించింది.

తమ ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు జల్లికట్టును అనుమతిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రాన్ని కోరింది. జాలర్ల సమస్యను పరిష్కరించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ, శ్రీలంక ప్రభుత్వం మధ్య చర్చలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. వరద బాధితులను ఆదుకునేందుకు వీలుగా తమిళనాడుకు వెంటనే నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించింది.

భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో సహాయ కార్యక్రమాలు, పునరావాస చర్యలు వేగంగా అమలయ్యేలా చూసినందుకు 'అమ్మ'కు ధన్యవాదాలు తెలుపుతూ కూడా అన్నాడీఎంకే తీర్మానం ఆమోదించింది. కాగా, ఏడోసారి  పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జయలలితను అన్నాడీఎంకే కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement