
అన్నాడీఎంకే అధినేత్రిగా మళ్లీ జయలలితే!
అన్నాడీఎంకే అధినేత్రిగా మరోసారి జయలలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత(66)ను పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అన్నాడీఎంకే అధినేత్రిగా మరోసారి జయలలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత(66)ను పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీతో పాటు దేశ సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని ఆమె ఈ సందర్బంగా అన్నారు. పార్టీ నిర్వాహక కార్యదర్శి విసలాచి నెడుంజెళియన్ ఎన్నికల కమిషనర్గా కూడా వ్యవహరించారు. ఆగస్టు 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగిందని, జయలలిత నుంచి మాత్రమే నామినేషన్లు వచ్చాయని ఆయన తెలిపారు.
దీంతో పార్టీ నియమాల ప్రకారం ఆమె ఎన్నికైనట్లు ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకొన్నందుకు జయలలిత తన మద్దతుదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 1987లో పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ మరణించినప్పటి నుంచి జయలలితే ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ఐదేళ్లకోసారి ఈ ఎన్నికలు జరుగుతాయి.