పెళ్లి.. మోసం: రచ్చకెక్కిన సినీ నటి | Actress Radha Complaint Against Her Second Husband | Sakshi
Sakshi News home page

పెళ్లి.. మోసం: రచ్చకెక్కిన సినీ నటి

Apr 16 2021 7:08 AM | Updated on Apr 16 2021 12:19 PM

Actress Radha Complaint Against Her Second Husband - Sakshi

వర్ధమాన సినీ నటి రాధ రచ్చకెక్కారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనను పెళ్లి చేసుకుని మోసం చేశారంటూ విరుగంబాక్కం పోలీసు స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు.

సాక్షి, చెన్నై: వర్ధమాన సినీ నటి రాధ రచ్చకెక్కారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనను పెళ్లి చేసుకుని మోసం చేశారంటూ విరుగంబాక్కం పోలీసు స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. సుందరం ట్రావెల్స్‌ చిత్రంలో కథానాయకీగా తమిళ సినీ రంగానికి రాధ(38) పరిచయం అయ్యారు. రాధ గురువారం విరుగ్గం బాక్కం పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ వసంత్‌ రాజ్‌పై ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది. 

పరిచయం..ప్రేమగా.... 
భర్తతో విడాకుల అనంతరం తల్లి, కుమారుడితో కలిసి శాలిగ్రామంలోని లోకయ్య వీధిలో రాధ నివాసం ఉంటున్నది. ఆర్‌కేపురం పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న తిరువాన్మియూరు ఎస్‌ఐ వసంత్‌ రాజ్‌తో గతంలో ఓ సినిమా షూటింగ్‌ సందర్భంలో పరిచయం ఏర్పడింది. తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా,  వసంత్‌రాజ్‌ అధిక సమయం రాధకు కేటాయిస్తూ వచ్చాడు. ఈ వ్యవహారం పసిగట్టి తిరువాన్మీయూరు సీఐకు వసంత్‌ రాజ్‌ భార్య గతంలో ఫిర్యాదు కూడా చేశారు.

వడపళనికి పోస్టింగ్‌
నిండా మునిగినోడికి చలి ఏమిటి అన్నట్టుగా ఇక పూర్తిగా రాధా మోజులో ఈ ఎస్‌ఐ పడ్డాడు. తర్వాత రాధ కోసం తిరువాన్మీయూరు నుంచి వడపళని పోలీసుస్టేషన్‌కు పోస్టింగ్‌ కూడా మార్చుకున్నాడు. ఈ సమయంలో రాధను రహస్యంగా పెళ్లి కూడా చేసుకుని జీవితాన్ని సాగిస్తూ వచ్చినట్టు సమాచారం అసలు కథ ఇక్కడే.. రాధ చేసిన ఓ చిన్న పొరబాటు వసంత్‌రాజ్‌ను అప్రమత్తం చేసింది. తనకు తెలియకుండా, తనతో సంప్రదించకుండా ఆధార్‌ కార్డు, ఇతర గుర్తింపు కార్డులో రాధా తన పేరును భర్తగా చూపించడం, ఆమె కుమారుడికి తండ్రిగా తన పేరు నమోదు చేసి ఉండడాన్ని వసంత్‌ రాజ్‌ గుర్తించాడు. దీంతో కథ బెడిసి కొట్టింది. . ఆమెకు దూరంగా ఉండాలని ఎన్నూరుకు పోస్టింగ్‌ మార్చుకున్నాడు. పోలీసుస్టేషన్‌ వద్దకే వెళ్లి గొడవ కూడా పడ్డట్టు సమాచారం. పోలీసు కావడంతో తన దైన స్టైల్లో బెదిరింపులు ఇవ్వడంతో ఆందోళనతో రాధా పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కింది.  తీగ లాగితే మోసాలు కూడా వెలుగులోకి రావడం గమనార్హం.

ఇప్పటికే ఇద్దరిపై ఫిర్యాదు.. 
విరుగ్గంబాక్కం పోలీసుల విచారణలో తనను మోసం చేశారంటూ రాధ  ఇప్పటికే రెండు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసినట్టు వెలుగు చూసింది.
చదవండి:
దారుణం: కూతురిపై తండ్రి కాల్పులు   
యూట్యూబ్‌లో పూజలు చూసి బిడ్డను బలిచ్చిన తల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement