
కన్నప్ప సినిమాలోని ‘సగమై – చెరి సగమై’ పాటతో అందరి దృష్టినీ ఆకర్షించింది హీరోయిన్ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). తమిళనాడుకు చెందిన ప్రీతి ముకుందన్ మలబార్ గోల్డ్, శరవణన్ స్టోర్స్, చెన్నై సిల్క్స్ వంటి సంస్థల కమర్షియల్ యాడ్స్‌లో మోడల్‌గా నటించింది. తండ్రి గోపాల్ ముకుందన్ వ్యాపారవేత్త. తల్లి చెన్నైలో డెంటిస్ట్‌గా ప్రాక్టీసు చేస్తోంది. తల్లి ప్రోత్సాహంతోనే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఆసక్తి పెంచుకుంది. తల్లే దగ్గరుండి భరతనాట్యం నేర్పించి, ప్రదర్శనలు ఇప్పించింది.
ప్రీతియే కాదు తల్లి కూడా నటించింది!
తల్లికి యాక్టింగ్ పట్ల ఎంత ఇష్టమంటే కన్నప్ప సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తే, తల్లి కూడా ఓ క్యారెక్టర్‌లో నటించింది. నటి లక్ష్మి కుమార్తె, ఒకనాటి హీరోయిన్ ఐశ్వర్య.. ప్రీతి ముకుందన్ తల్లి కాలేజీలో క్లాస్‌మేట్స్. న్యూజిలాండ్‌లో కలుసుకున్నప్పుడు ఇద్దరు స్నేహితురాళ్ళూ ఎంతో థ్రిల్ ఫీలయ్యారు. కాలేజీ కబుర్లు నెమరేసుకున్నారు. 2001 జులై 30 సోమవారం నాడు పుట్టింది ప్రీతి ముకుందన్. సోమవారం శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు. అయితే, శివ భక్తుడు కన్నప్ప మీద తీస్తున్న సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లే వచ్చి పోయింది.
ఆ హీరోయిన్ తప్పుకోవడం వల్ల..
కన్నప్పలో హీరోయిన్ క్యారెక్టర్ ఆడిషన్‌కి ప్రీతి ముకుందన్ వచ్చింది. కానీ, నుపూర్ సనన్‌ని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. కన్నప్ప సినిమా ఓపెనింగ్‌లో కూడా నుపూర్ సనన్ పాల్గొంది. అప్పుడు ఎంతో బాధ పడినట్లు ప్రీతి ముకుందన్ చెప్పింది. అయితే తర్వాత నుపూర్ సినిమా మానేయడంతో– మళ్ళీ హీరోయిన్ చాన్స్ ప్రీతి ముకుందన్‌ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ శివుడే తనకు ఈ అవకాశం ఇచ్చాడని ప్రీతి నమ్మకం.

(చదవండి: మొదటి భార్యకు విడాకులు.. దేవదాసులా తాగుడుకు బానిసయ్యా..: హీరో)
ఆ రూమర్స్‌తో హర్టయ్యా
మ్యూజికల్ వీడియో ఆల్బమ్స్‌తో ప్రీతి చాలా పాపులర్. ముత్తు–2, ఆశాకాండ, మోరిని మొదలైన వీడియోల్లో డ్యాన్స్ చేసింది. కన్నప్ప మొదటి తెలుగు సినిమా కాదు. అంతకు ముందు ‘ఓం భీమ్ బుష్’ అనే సినిమాలో శ్రీ విష్ణు పక్కన హీరోయిన్‌గా నటించింది. తమిళంలో స్టార్ అనే సినిమాలో మొదటిసారి నటించింది. ఆ సినిమా హీరో కెవిన్‌తో తన పేరు జత చేసి, రూమర్స్ వచ్చినప్పుడు కొంచెం ఫీలయ్యాను అంది.
ప్రభాస్‌తో నటించడం..
కన్నప్ప సినిమా కోసం హార్స్ రైడింగ్, కత్తిసాములో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది. గ్లామరస్‌గా ఎక్స్‌పోజ్ చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటో షూట్స్‌తో ప్రపంచానికి చాటి చెబుతూనే ఉంది. మలయాళంలో మైనే ప్యార్ కియా అనే సినిమా కూడా చేసింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ను కలుస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ ఆయనతో కలిసి యాక్ట్ చేయడం కెరీర్‌లోనే కిక్ ఇచ్చిన హయ్యస్ట్ మూమెంట్ అంది ప్రీతి ముకుందన్.
చదవండి: నలుగురు సంతానం, ఇంకా పిల్లలు కావాలన్నా.. కుటుంబ నియంత్రణపై విష్ణు కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment