10కోట్లకు శఠగోపం పెట్టిన బుల్లితెర నటి | TV artiste dupes colleagues of Rs 10 crore | Sakshi
Sakshi News home page

10కోట్లకు శఠగోపం పెట్టిన బుల్లితెర నటి

Published Thu, Mar 13 2014 4:59 PM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

10కోట్లకు శఠగోపం పెట్టిన బుల్లితెర నటి

10కోట్లకు శఠగోపం పెట్టిన బుల్లితెర నటి

హైదరాబాద్ : చిట్టీల పేరుతో ఓ బుల్లితెర నటి ఘరానా మోసానికి పాల్పడింది. టీవీ ఆర్టిస్ట్ విజయరాణి...జూనియర్ ఆర్టిస్టుల వద్ద సుమారు 10కోట్ల రూపాయాల వరకూ వసూలు చేసి ఉడాయించింది. గత కొంతకాలంగా విజయరాణి ఎంతో నమ్మకంగా స్థానికంగా చిట్టీలు నిర్వహించేది. సమయానికి చిట్టీ డబ్బులు ఇచ్చివేసేది.

 

నమ్మకం కుదరటంతో పలువురు జూనియర్ ఆర్టిస్ట్లు ఆమె వద్ద చిట్టీలు వేశారు.  పెద్ద మొత్తంలో చిట్టీలు వేసిన ఆమె...అదును చూసుకుని పరారైంది. దాంతో ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితులు సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న విజయరాణి కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement