
సాక్షి, హైదరాబాద్ : దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్ రిలయన్స్ జువెల్స్ మరోసారి అద్భుతమైన కలెక్షన్స్‌ను అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా వినూత్న డిజైన్లకు ప్రాధాన్యత ఇచ్చే రిలయన్స్ తాజాగా హస్తకళలు, ప్రసిద్ధ వారసత్వ కట్టడాలు ప్రేరణగా జ్యుయల్లరీ రూపొందించింది. రానున్న అక్షయ తృతీయ సందర్భంగా ‘అపూర్వం’ పేరుతో టెంపుల్ జ్యుయల్లరీని ఆవిష్కరించింది.
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన హంపితో పాటు దక్షిణ, పశ్చిమ భారతదేశంలో ముఖ్యమైన, ప్రముఖ స్మారక చిహ్నాలు, వివిధ కట్టణాల సున్నితమైన వంపులు, శిల్పాలు ప్రేరణగా విభిన్నమైన కళాకృతులతో ఆభరణాలను రూపొందించింది.
అక్షయ తృతీయ ఆఫర్
అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను కూడా అందిస్తోంది రిలయన్స్ జువెల్స్. 2019 మే 7 వ తేదీ వరకు బంగారు ఆభరణాల మేకింగ్ చార్జీపై 25శాతం, వజ్రాల ఆభరణాలపై 25 శాతం తగ్గింపును అందిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
హంపితోపాటు బేలూరులోని చెన్నకేశవ ఆలయం, ప్రసిద్ధ భువనేశ్వరి ఆలయం గోపురం, ఏనుగులు, గుర్రాలు, కమలం, ఆలయ ద్వారం వద్ద చెక్కిన దశావతారం ఇతర అనేక నృత్య రూపాల స్ఫూర్తిగా అతి క్లిష్టమైన డిజైన్లతో ఆభరణాలను తమ వినియోగదారులకోసం సిద్ధం చేశామని రిలయన్స్ జువెల్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు.