రిలయన్స్ ఆభర్‌ కలెక్షన్స్‌    | Reliance Jewels unveils WeOweYou campaign to express gratitude | Sakshi
Sakshi News home page

రిలయన్స్ ఆభర్‌ కలెక్షన్స్‌   

Published Thu, Aug 13 2020 3:52 PM | Last Updated on Thu, Aug 13 2020 4:55 PM

Reliance Jewels unveils WeOweYou campaign to express gratitude - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్‌ సంస్థ రిలయన్స్‌ జ్యువెల్స్‌  వార్షికోత్సవ కానుగా అద్భుతమైన కలెక్షన్స్‌ను లాంచ్‌ చేసింది. ‘‘ఆభర్’’  పేరుతో వినూత్న డిజైన్లతో బంగారం, వెండి, వజ్రాభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ సందర్భంగా తమ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు రిలయన్స్ జ్యువెల్స్‌  ‌ తెలిపింది.

ఒక దశాబ్దానికి పైగా తమ బ్రాండ్‌కు అండగా నిలిచిన  వినియోగదారులందరికీ కృతజ్ఞతగా వి వోయూ  (మేము మీకు రుణపడి ఉన్నాము ) థీమ్‌తో  ఒక ప్రమోషన్‌ వీడియోను విడుదల చేసింది. కస్టమర్లకు కృతజ్ఞతను చాటేలా ఈ ప్రమోషన్ క్యాంపైన్‌ను స్కేర్‌క్రో ఎం అండ్ సీ సాట్చి డిజైన్ చేయడం విశేషం. 3-15 గ్రాములతో  54 ఎక్స్ క్లూజివ్ కలెక్షన్స్‌ అందుబాటులో ఉంచింది.  బంగారు ఆభరణాలపై మేకింగ్ చార్జెస్ పై 24 శాతం, డైమండ్ జువెలరీ పై 30 శాతం తగ్గింపుతో ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. ఆస్టు 31 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. అలాగే కోవిడ్‌-19కు సంబంధించిన భౌతిక దూరం లాంటి అన్ని మార్గదర్శకాలతో తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని రిలయన్స్ జ్యువెల్స్ ప్రకటించింది. ఆధునిక మహిళల అభిరుచులకు తోడుగా, ఆశ, వెలుగులు నింపేలా లాంతర్ల స్ఫూర్తితో డిజైన్లను రూపొందించినట్టు తెలిపింది. కఠినమైన సమయాల్లో వారి మద్దతు ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని  రిలయన్స్ జ్యువెల్స్‌  సీఈఓ సునీల్ నాయక్  ఒక ప్రకటన విడుదల చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement