
సాక్షి, హైదరాబాద్: భారతదేశపు అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన రిలయన్స్ జ్యువెల్స్ నూతన సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొచ్చిన వినూత్న ఆభరణాల ఆఫర్‌ను హాలిడే కలెక్షన్స్ పేరుతో కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కలెక్షన్‌ను తీసుకొచ్చింది. అత్యధ్బుతమైన హస్తకళా నైపుణ్యాన్ని జోడించి ‘బెల్లా ది హాలిడే కలెక్షన్’ పేరుతో సరికొత్త, సమకాలీన స్టైలిష్ ఆభరణాలను ప్రారంభించింది. రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్, డైమండ్ కేటగిరీల్లో స్పెషల్ నెక్లెస్‌లను, బ్రాస్‌లెట్లను లాంచ్ చేసింది.
అధునాతన డిజైన్, స్టయిల్‌తో తమ బెల్లా కలెక్షన్ ఆకట్టుకుంటుందని రిలయన్స్ జ్యువెల్స్ ప్రకటించింది. తమ బెల్లా ఆభరణాలకు వినియోగదారులనుంచి మంచి ఆదరణ లభిస్తుందనే విశ్వాసాన్ని రిలయన్స్ ప్రతినిధి వెల్లడించారు. రూ. 5 వేల నుంచి ఇవి లభ్యమని చెప్పారు. అలాగే అందమైన డైమండ్ లైన్ బ్రాస్‌లెట్స్ రూ .69,999 నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక ధరలో లభిస్తాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను కూడా అందిస్తోంది. బంగారు ఆభరణాలపై 20 శాతం, డైమండ్ ఆభరణాలపై 20 శాతం మేకింగ్ చార్జీలపై డిస్కైంట్ లభ్యం. ఈ ఆఫర్ 16 వ తేదీ ఫిబ్రవరి 2020 వరకు చెల్లుతుంది. వందకు పైగా నగరాల్లో 200 పైగా స్టోర్లతో సేవలను అందిస్తున్న రిలయన్స్ జ్యువెల్స్ త్వరితగతిన విస్తరిస్తోంది. రిలయన్స్ జ్యువెల్స్ బ్రాండ్ 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్ ఆభరణాలను మాత్రమే అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment