‘ఇరిస్సా కలెక్షన్’ను ఆవిష్కరించిన రిలయన్స్ జువెల్స్ | SILIGURI | Reliance Jewels launches Irissa Collection at Siliguri | Sakshi
Sakshi News home page

‘ఇరిస్సా కలెక్షన్’ను ఆవిష్కరించిన రిలయన్స్ జువెల్స్

Published Fri, Oct 7 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

‘ఇరిస్సా కలెక్షన్’ను ఆవిష్కరించిన రిలయన్స్ జువెల్స్

‘ఇరిస్సా కలెక్షన్’ను ఆవిష్కరించిన రిలయన్స్ జువెల్స్

ముంబై: రిలయన్స్ జువెల్స్ తాజాగా తన వినియోగదారుల కోసం కాలాతీత, సున్నితమైన డిజైన్లతో కూడిన ‘ఇరిస్సా కలెక్షన్’ను ఆవిష్కరించింది. హస్తకళా నైపుణ్యంతో కూడిన అందమైన పెండెంట్, నెక్లెస్ సెట్స్ ఇందులో ఉన్నాయి. తాను ప్రత్యేకంగా ఉండాలనుకునే ప్రతి మహిళ కోరికను దృష్టిలో ఉంచుకొని ఈ విస్తృత శ్రేణి కలెక్షన్‌ను తీర్చిదిద్దామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని పాత బంగారం మార్పిడిపై జీరో డిడక్షన్ (అక్టోబర్ 1 నుంచి 10 వరకు)ను అందిస్తున్నామని పేర్కొంది. అలాగే బంగారు, డైమండ్ ఆభరణాలు సహా 10 గ్రాములు ఆపై బరువైన 24 క్యారెట్ల బంగారు నాణేల తయారీ చార్జీలపై వరుసగా 30 శాతం, 25 శాతం, 50 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారులకు తాజా ఆఫర్లు ఈ నెల 19 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement