ముంబై: రిలయన్స్ జువెల్స్ 14 వ వార్షికోత్సవ సందర్బంగా తన కస్టమర్లకు సరికొత్త కలెక్షన్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే కొనసాగుతున్న జువెలరీ కలెక్షన్‌కు ‘ఆభార్’ ను ఎక్స్‌టెన్షన్‌గా లాంచ్ చేసింది. ఈ కలెక్షన్ లాంచ్‌తో కస్టమర్లకు, ఉద్యోగులకు, కళాకారులకు రిష్తోన్‌కాధాగా అనే థీమ్‌తో కంపెనీ కృతజ్ఞతలను ప్రకటించింది. ఆభార్ కలెక్షన్‌లో భాగంగా సరికొత్త జువెలరీ కలెక్షన్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచనుంది. ఈ కలెక్షన్‌లో అద్బుతమైన బంగారం, వజ్రాల ఇయర్ రింగ్స్ కొత్త డిజైన్‌లు కస్టమర్లకు లభించనున్నాయి.
రిలయన్స్ జువెల్స్ జూలై 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 20 శాతం మేర స్పెషల్ యానివర్సరీ తగ్గింపును ప్రకటించింది. #RishtonKaDhaga అనే మల్టీ మీడియా క్యాంపెన్‌తో రిలయన్స్ జువెల్స్ తమ కస్టమర్లకు, ఉద్యోగులకు సందేశాన్ని ఇచ్చింది. ఈ సందర్బంగా రిలయన్స్ జువెల్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ..గత కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్ జువెల్స్‌ను ఆదరిస్తోన్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆభార్ కలెక్షన్‌తో రిలయన్స్ జువెల్స్‌కు, కస్టమర్లకు ఉన్న బంధం మరింత బలపడుతుందనీ ఆశాభావం వ్యక్తంచేశారు.
Reliance Jewels: ‘ఆభార్’ కలెక్షన్‌ను లాంఛ్ చేసిన రిలయన్స్ జువెల్స్
Published Thu, Aug 5 2021 8:58 PM | Last Updated on Thu, Aug 5 2021 11:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment