
చందన బ్రదర్స్ చోరీ కేసు చేధించిన పోలీసులు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి చందనబ్రదర్స్ దొంగతనం కేసును పోలీసులు గురువారం చేధించారు. ఆ కేసుకు సంబంధించిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. మరికాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ అర్థరాత్రి ... చందన బ్రదర్స్ షాపులోకి దొంగలు ప్రవేశించి భారీగా బంగారం, రూ. 15 లక్షల నగదు అపహరించుకుని పోయారు.
దాంతో చందనా బ్రదర్స్ యాజమాన్యం కూకట్పల్లి పోలీసులకు ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో నిందితులను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు.