వెరైటీ మేళా
జ్యువెలరీ నుంచి హ్యాండీక్రాఫ్ట్స్ వరకు.. యాక్సెసరీస్ నుంచి కిడ్స్‌వేర్ వరకు.. అన్నీ ఒకేచోట కొలువుదీరారుు. వూదాపూర్ హైటెక్స్‌లో శుక్రవారం పేజ్ త్రీప్రవుుఖురాలు పింకిరెడ్డి ప్రారంభించిన ‘దీప్‌మేళా’లో ఫ్యాషన్ ప్రియుులకు కావల్సిన విభిన్న వస్త్రాభరణాలు, గృహాలంకరణ వస్తువులు అందుబాటులో ఉన్నారుు. కోల్‌కతా, మధ్యప్రదేశ్, ముంబై, బెంగళూర్, చెన్నై తదితర నగరాల నుంచే కాక చైనా, పాకిస్థాన్, ఇటలీ దేశాల ఉత్పత్తులు కూడా ఉన్నారుు. ప్రత్యేకించి డిజైనర్ టాప్స్, డ్రెస్సులు, చీరలు, గిఫ్ట్ ఆర్టికల్స్, స్కూల్ పిల్లలు తయారు చేసిన పేపర్ బ్యాగ్స్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆదివారం వరకు జరగనున్న ఈ మేళాలో ఫుడ్స్, ఐస్‌క్రీమ్స్, ఫాస్ట్‌ఫుడ్ వెరైటీస్ నోరూరిస్తున్నారుు. పాప్ గాయని స్మిత, సిటీ ప్రముఖురాలు అంజుపోద్దార్, అర్పిత తదితరులు మేళాను సందర్శించారు.
- శిరీష చల్లపల్లి
ఫొటోలు: రాజేష్‌రెడ్డి
సింఫనీ ఆఫ్ లైఫ్
‘సమస్త మేఘాలతో అనేక రంగుల్లో ఆకాశం వర్షించిన ఆనందమూ-విషాదమూ శ్రమజీవి జీవితం’ అనే రవీంద్రనాథ్ టాగోర్ కవితా పాదానికి కమనీయ దృశ్యరూపం ఈ చిత్రం. టి.ఎ.అబ్రహాం 1955లో బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించిన ఈ పది నిమిషాల డాక్యుమెంటరీ దేశంలోని వివిధ ప్రాంతాలకు.. వివిధ వృత్తులకు చెందిన స్త్రీ-పురుషుల శ్రమజీవనాన్ని దృశ్య కావ్యంగా మలచింది. ప్రముఖ మ్యుజీషియన్ విష్ణుదాస్ షిరాలి సంగీతం సమకూర్చారు. కేన్స్ పోటీ విభాగంలో సింఫనీ ఆఫ్ లైఫ్ ప్రదర్శితమైంది. 1920ల్లో మూకీ సినిమాల్లో నటించిన విఖ్యాత హిందీ దర్శకుడు శాంతారామ్ ఫిలిమ్స్ డివిజన్ చీఫ్ ప్రొడ్యూసర్ హోదాలో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం!
చార్: ది నో మ్యాన్స్ ఐలాండ్
సౌరవ్ సారంగి దర్శకత్వంలో ఫిలిమ్స్ డివిజన్ ఆధ్వర్యంలో ఇండియా-ఇటలీ దేశాలు 2012లో సంయుక్తంగా ఈ చిత్రం రూపొందించాయి. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పేదల జీవితానికి చిత్రం అద్దం పడుతుంది. 14 ఏళ్ల రూబెల్ గంగా నదిని దాటి భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు బియ్యం స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఒకసారి నదిలో వరద తగ్గిన తరువాత ‘చార్’ అనే ద్వీపం ఏర్పడుతుంది. ‘చార్ ఎవరికీ చెందని స్థలం’ కాబట్టి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాపలా కాస్తుంది. చార్‌లో చిక్కుకుపోయిన రూబెల్ కుటుంబం.. వర్షంలో ఇండియాకు తప్పించుకు వచ్చేందుకు ప్రయత్నిస్తారు. ప్రకృతి వైవిధ్యాన్ని సారంగి వేర్వేరు కెమెరాలతో స్వయంగా చిత్రీకరించారు. ఈ చిత్రానికి బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌లో విమర్శకుల ప్రశంసలు లభించాయి!
- పున్నా కృష్ణమూర్తి