![Ritz Paris robbery: jewels worth 38.5 crores seized in armed heist - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/11/Ritz%20Paris%20Robbery.jpg.webp?itok=Qfm3-uvD)
పారిస్ : ఐదుగురు ముసుగు దొంగలు బుధవారం పారిస్ నగరంలో కలకలం సృష్టించారు. సెంట్రల్ పారిస్‌లో గల రిడ్జ్ ఫైవ్ స్టార్ హోటల్‌లోకి చొరబడిన దుండగులు రూ. 38,66,69,250/- విలువజేసే వజ్రాభరణాలను దోచుకెళ్లారు.
దోపిడీపై హోటల్ చట్టుపక్కల ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు సమాచారం అందుకుని ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. కాగా, మిగిలిన ఇద్దరు దొంగలు నగలతో చాకచక్యంగా తప్పించుకున్నారు.
పారిస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో దుండగులు హోటల్‌లోకి ప్రవేశించారు. కత్తులు, గొడ్డళ్లతో హోటల్ డిస్ప్లేలను పగులగొట్టి ఆభరణాలను దోచుకున్నారు. దోపిడి దొంగలు చొచ్చుకురావడంతో హోటల్‌లోని గెస్ట్స్ కిచెన్‌లో దాక్కున్నట్లు చెప్పారు.
మరికొందరు వాళ్ల నుంచి తప్పించుకుని బయటకు వచ్చారని తెలిపారు. దీంతో దుండగులు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. కాల్పుల్లో హోటల్ సిబ్బంది ఒకరు గాయపడ్డారని తెలిపారు. తప్పించుకు పారిపోయిన ఇద్దరు దుండగులను పట్టుకోవడానికి పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment