సంతానం కలిగిస్తామని బురిడీ | two mwn cheated woman and escape with gold and money | Sakshi
Sakshi News home page

సంతానం కలిగిస్తామని బురిడీ

Published Mon, Jan 15 2018 11:25 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

two mwn cheated woman and escape with gold and money - Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లా, వేంపల్లె: సంతానం కలిగిస్తామని ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి  బంగారు, నగదుతో ఉడాయించిన సంఘటన ఆదివారం వేంపల్లెలోని రాజారెడ్డినగర్‌లో చోటుచేసుకుంది. బాధితులు ఎస్‌ఐ చలపతికి చేసిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజారెడ్డినగర్‌లో జల్లా శంకర్‌రెడ్డి, భార్య శివమ్మ, తల్లి శివమ్మలు నివాసం ఉంటున్నారు. శంకర్‌రెడ్డికి వేముల మండలం దుగ్గన్నగారిపల్లె గ్రామానికి చెందిన శివమ్మతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇంత వరకు వారికి సంతానం లేదు. ఆయన పులివెందుల రోడ్డులో తోపుడు బండిపై బజ్జీలు వేసుకొని జీవనం  సాగించేవాడు. భోగి పండుగ కావడంతో అతను ఆదివారం ఇంట్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో  ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని యువకులు వచ్చి మీకు ఆయుర్వేద మందు ద్వారా సంతానం కలిగిస్తామని నమ్మబలికారు.

ఆ దంపతులు నమ్మడంతో ఆయుర్వేద మందు తయారు చేయాలంటే రెండు గ్రాముల స్వర్ణభస్మం కోసం రూ.20వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. శంకర్‌రెడ్డి వెంటనే వారికి రూ.20 వేలు అందజేశాడు. తర్వాత ఏదో ఒక కంప్యూటర్‌ మిషన్‌ను శంకర్‌రెడ్డి వీపు భాగంలో, భార్య శివమ్మకు పొట్టపైన పెట్టి పరీక్షించారు. శివమ్మకు కడుపులో గడ్డ ఉందని, తామిచ్చిన మందుతో గడ్డ కరిగి సంతానం కలుగుతుందని చెప్పారు. అలాగే శంకర్‌రెడ్డికి వేడి ఎక్కువగా ఉందని, దాన్ని తగ్గించేందుకు మందులు ఇస్తామని తెలిపారు. ఈ మందు తయారు  చేసేందుకు శంకర్‌రెడ్డిని మునగ ఆకు తీసుకురమ్మని, భార్య శివమ్మను తలస్నానం చేసి రమ్మని పంపారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సోదా చేసి  ఒక తులం బంగారు ఉంగరాన్ని తీసుకొని పారిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement