RITZ hotel
-
ఫైవ్‌స్టార్ హోటల్లో రూ.38 కోట్ల నగలు దోపిడి
పారిస్ : ఐదుగురు ముసుగు దొంగలు బుధవారం పారిస్ నగరంలో కలకలం సృష్టించారు. సెంట్రల్ పారిస్‌లో గల రిడ్జ్ ఫైవ్ స్టార్ హోటల్లోకి చొరబడిన దుండగులు రూ. 38,66,69,250/- విలువజేసే వజ్రాభరణాలను దోచుకెళ్లారు. దోపిడీపై హోటల్ చట్టుపక్కల ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు సమాచారం అందుకుని ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. కాగా, మిగిలిన ఇద్దరు దొంగలు నగలతో చాకచక్యంగా తప్పించుకున్నారు. పారిస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో దుండగులు హోటల్లోకి ప్రవేశించారు. కత్తులు, గొడ్డళ్లతో హోటల్ డిస్ప్లేలను పగులగొట్టి ఆభరణాలను దోచుకున్నారు. దోపిడి దొంగలు చొచ్చుకురావడంతో హోటల్లోని గెస్ట్స్ కిచెన్‌లో దాక్కున్నట్లు చెప్పారు. మరికొందరు వాళ్ల నుంచి తప్పించుకుని బయటకు వచ్చారని తెలిపారు. దీంతో దుండగులు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. కాల్పుల్లో హోటల్ సిబ్బంది ఒకరు గాయపడ్డారని తెలిపారు. తప్పించుకు పారిపోయిన ఇద్దరు దుండగులను పట్టుకోవడానికి పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రత్యామ్నాయంగా స్థలం ఇవ్వండి
• సచివాలయం అప్పగింతకు ఏపీ కొత్త ప్రతిపాదన • రిట్జ్ హోటల్ పక్కన ఖాళీ స్థలం ఇవ్వాలని రాయబారం • స్థలానికి బదులు హెర్మిటేజ్ భవనం ఇవ్వాలని తెలంగాణ యోచన • తాత్కాలిక భవనాలకు ఆఫీసుల తరలింపు బాధ్యత జీఏడీకి సాక్షి, హైదరాబాద్: తమ అధీనంలో ఉన్న భవనాలను అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. తాత్కాలిక భవనంతో పాటు కొత్త సచివాలయం నిర్మించుకునేందుకు తమకు స్థలం అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరనుంది. ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలోని రిట్జ్ హోటల్ పక్కనున్న స్థలం తమకు కేటాయించాలని రాయబారం పంపిం చినట్లు తెలిసింది. తమ భవనాలను అప్పగించేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సమ్మతించింది. అవి ఖాళీగానే ఉన్నందున, తెలంగాణ అవసరాలకు అప్పగించేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డట్లు సమాచారం. సచివాలయంలోని భవనాలతో పాటు అసెం బ్లీ, కౌన్సిల్ భవనాలు ఇచ్చేందుకు ఇటీవల గవర్నర్‌తో భేటీ సందర్భంగా చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం పరిధిలో ఉన్న అంశం కావటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సచివాలయం అప్పగించాలని కోరుతూ మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించిం ది. ఏపీ లేవనెత్తిన ప్రతిపాదనపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న వ్యాపార, వాణిజ్య పరమైన స్థలాలను ఎవరికీ అప్పగించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీ కోరినట్లుగా స్థలాన్ని ఇవ్వాలా.. వద్దా అనేది కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కూల్చివేతకు రూ. 30 కోట్లు... ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం ఆర్అండ్బీ విభాగానికి అప్పగించింది. కూల్చివేతలకు దాదాపు రూ.30 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. వీటికి టెండర్లు పిలవాలని యోచిస్తోంది. మరోవైపు సచి వాలయం తరలించే పనులను ప్రభుత్వం సాధారణ పరిపాలన విభాగాని(జీఏడీ)కి అప్పగిం చింది. ఆఫీసుల తరలింపుతో పాటు కొత్త భవనాల్లో అదే తీరుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఆఫీసు వాతావరణంతో పాటు అధికారుల హోదాకు తగినట్లుగా కార్యాలయాల్లో ఏసీలు, ఫర్నిచర్ సిద్ధం చేసి.. ఫైళ్లను భద్రపరచాల్సి ఉంటుంది. అవసరమైనన్ని కంప్యూటర్లు, సర్వర్ సేవలన్నీ యథాతథంగా అమర్చాలి. ఇవన్నీ జీఏడీ పర్యవేక్షణలో చేపడతారు. రాష్ట్ర పునర్విభజన సమయంలోనే సచివాల యంలో ఉన్న కొన్ని సెక్షన్ల తరలింపు, అన్ని సేవల పునరుద్ధరణకు ఆరు నెలల సమయం పట్టిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక భవనాలకు తరలివెళ్లడం ప్రయాసతో కూడుకున్న పనేనని, ప్రభుత్వ కార్యకలాపాలు మళ్లీ కొంతకాలం స్తంభించిపోతాయని అభిప్రాయపడుతున్నారు. సీఎం క్యాంపు ఆఫీసులోనే కేబినెట్ భేటీలు సచివాలయం తరలింపు నేపథ్యంలో ఇకపై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే నిర్వహించనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న సీఎం అధికారిక నివాసంలోనే అందుకు ప్రత్యేక హాల్‌ను నిర్మిస్తున్నారు. ఇకపై జరిగే కేబినెట్ భేటీలు అక్కడే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. ఉరుకులు పరుగులు.. సచివాలయాన్ని తరలించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. 15 రోజుల్లో ఆఫీసులు ఖాళీ చేయాలని ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక భవనాలను వెంటనే పరిశీలించాలని.. తమ శాఖల అవసరాలకు సరిపోతాయో లేదో స్వయంగా పర్యవేక్షించాలని సూచించింది. దీంతో అన్ని శాఖల అధికారులు మంగళవారం అదే పనిలో నిమగ్నమయ్యారు. తమకు నిర్దేశించిన తాత్కాలిక భవనాలకు వెళ్లి సదుపాయాలను పరిశీలించారు. సచివాలయంలో ఉన్న కీలకమైన విభాగాలన్నీ బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు తరలించటం ఖాయమైంది. ప్రస్తుతం బీఆర్కే భవన్లో ఉన్న విజిలెన్స్ ఆఫీసులతో పాటు మిగతా కార్యాలయాలను నాంపల్లిలోని గృహకల్ప, మనోరంజన్ భవన్లకు తరలించాలని నిర్ణయించారు. ఏపీ సచివాలయానికి ప్రస్తుతం సెర్ప్ ఆఫీసున్న హెర్మిటేజ్ కాంప్లెక్స్‌ను అప్పగించాలని నిర్ణయించారు. సెర్ప్ ఆఫీసును తరలించేందుకు సంబంధిత అధికారులు అమీర్‌పేటలోని మైత్రీవనం లేదా పాత అపార్డ్ భవన్‌ను పరిశీలించారు. -
ఎమ్మెల్యేల క్లబ్‌గా రిట్జ్ హోటల్!
-
ఎమ్మెల్యేల క్లబ్‌గా రిట్జ్ హోటల్!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇక రాజభోగమే. వారి విలాసాల కోసం ప్రత్యేకంగా క్లబ్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. అదెక్కడో హైదరాబాద్ శివారులో కాదు... ఇటు సచివాలయం, అటు శాసనసభకు కూతవేటు దూరంలోనే. నగరం నడిబొడ్డున సుమారు రూ. 200 కోట్ల విలువైన స్థలంలో ఉన్న రిట్జ్ హోటల్ ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్లబ్‌గా మారనుంది. ఒకపక్క విభజన బిల్లు నేపథ్యంలో రాష్ట్రమంతా ఆందోళనకర పరిస్థితుల్లో ఉండగా, మరోపక్క ప్రజాప్రతినిధులు, మంత్రులు మాత్రం తాము ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేందుకు ప్రత్యేకంగా క్లబ్‌ను ఏర్పాటు చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. రాష్ట్ర విభజన పూర్తయ్యేలోగా రిట్జ్ హోటల్ స్థలాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్లబ్‌కు కేటాయించేలా ప్రజాప్రతినిధుల సౌకర్యాలకు సంబంధించిన అసెంబ్లీ కమిటీ ద్వారా ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ తరహాలోనే ఇక్కడా ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా క్లబ్ ఉండాలని ఆ కమిటీ ద్వారా సిఫారసు చేయించినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా గురువారం సభ్యులు గ్రూపు ఫొటో దిగుతున్న సమయంలో పలువురు ఎమ్మెల్యేలు క్లబ్ సంగతి ఏమి చేశారంటూ మంత్రులను ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగేలోపే రిట్జ్ హోటల్ స్థలాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్లబ్ నిర్మాణానికి కేటాయించాలంటూ ప్రస్తావించారు. దీంతో ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు సీనియర్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. త్వరలోనే ఉత్తర్వులు: రిట్జ్ హోటల్ ప్రస్తుతం ఐదెకరాల విస్తీర్ణంలో ఉంది. గతంలో ఇది నిజాం నవాబు మొజం ఝూ అధికార నివాసంగా ఉండేది. అనంతరం సిటీ డెవలప్మెంట్ బోర్డు కార్యాలయంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రిట్జ్ హోటల్ స్థలాన్ని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నించారు. అయితే తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి దాన్ని పర్యాటక శాఖకు అప్పగించారు. ఇప్పుడు అది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్లబ్‌గా మారనుంది. దీని స్థలం విలువ దాదాపు 200 కోట్ల రూపాయలకు పైమాటేనని ఓ ఎమ్మెల్యే అంచనావేసి చెప్పారు. దీన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్లబ్ నిర్మాణం కోసం కేటాయిస్తూ త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలిపారు.