అన్నిటికీ సూట్ అవుతాయ్..!
ఇంటికి - ఒంటికి
ఇంట్లో చాలా వస్తువులను పాడైనప్పుడు, వాటి అవసరం తీరాక పడేస్తూ ఉంటాం. కానీ కొన్నిటిని రీసైకిల్ చేసుకుంటే... ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో సూట్‌కేస్, ట్రంకు పెట్టెలు ముందు వరుసలో ఉంటాయి. కొన్ని సూట్‌కేసులను చిరిగిపోయాయనో, రంగు పాడైందనో పడేస్తుంటాం. కానీ ఒకసారి పక్కనున్న ఫొటోలను చూస్తే ఇకపై మీరు అలా చేయరులేండి. పాతబడిన సూట్‌కేసులకు రంగురంగుల కవర్లు తొడిగితే చాలు అవి కొత్తవాటిలా తళతళా మెరిసిపోతాయి.
అప్పుడు అందులో మీ జ్యుయెలరీ (ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నెక్‌లేస్, చెయిన్స్, బ్రేస్‌లెట్స్...) పెట్టుకోవచ్చు. అలాగే వాటిలో మేకప్‌కు సంబంధించిన ప్రాడక్ట్స్‌ను కూడా దాచుకోవచ్చు. అంతేకాదు వైద్యానికి సంబంధించిన వస్తువులు (ఫస్ట్ ఎయిడ్ కిట్), చిన్న పిల్లల సామగ్రినీ అందులో పెట్టుకోవచ్చు. అలాగే పెట్ హౌజ్‌లా కూడా ఈ సూట్‌కేసులను ఉపయోగించుకోవచ్చు. మరీ పాడైపోయిన వాటినైతే పూలతొట్లలా మార్చి, అందులో మొక్కలు పెంచుకోవచ్చు. వాడుకున్న వాళ్లకు వాడుకున్నంత అన్నట్టు.. వాటిని టీ పాయ్, టేబుల్, చెయిర్, సోఫా.. ఇలా విరివిగా ఉపయోగించుకోవచ్చు.