breaking news
suit case
-
సూట్ కేసులో కుక్కి.. ఓ సెల్ఫీ దిగి..!
ఆమె అతన్ని ప్రేమించింది. అతను ఆమెతో పాటు మరో యువతినీ ప్రేమించాడు. ఈ క్రమంలో రెండో గర్ల్‌ఫ్రెండ్ వ్యవహారం మొదటి గర్ల్‌ఫ్రెండ్‌కు నచ్చలేదు. ఆమెతో తిరగడం ఆపేయాలంటూ ప్రియుడ్ని వారించింది. దానిని సీరియస్‌గా తీసుకున్న ఆ యువకుడు.. ఎలాగైనా మొదటి ప్రేయసిని వదిలించుకోవాలని ప్రయత్నాలు చేశాడు. కానీ, ఆమె మాత్రం అతన్ని విడిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఏం చేయాలో పాలుపోక.. ఘాతుకానికి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లో యమునా నదిలో దొరికిన ‘సూట్‌కేసులో యువతి డెడ్‌బాడీ మిస్టరీ’.. రెండు నెలల తర్వాత వీడింది. తన అబద్ధాలతో రెండు నెలలపాటు పోలీసులను ఏమార్చిన యువకుడు.. చివరకు నేరం అంగీకరించాడు. రెండో ప్రేయసి కోసమే మొదటి ప్రేయసిని హతమార్చినట్లు అంగీకరించాడు. ఈ క్రమంలో ఆ యువకుడిని, అతనికి సహకరించిన స్నేహితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశాడు. అయితే విచారణలో నిందితులు విస్తుపోయే వివరాలనే వెల్లడించారు. ఆగస్టు 8వ తేదీన కాన్పూర్‌కు చెందిన అకాంక్ష(18) అనే యువతి కనిపించడం లేదంటూ ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి బర్రాలోని ఓ రెస్టారెంట్లో పని చేస్తుందని తెలుసుకున్న పోలీసులు.. రకరకాల కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తొలుత ఆ యువతి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడి(20)తో వెళ్లిపోయిందని భావించారు. ఈ క్రమంలో.. అతన్ని విచారణ జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె తనతో చాలా రోజుల నుంచి టచ్‌లో లేదంటూ ఆ యువకుడు చెప్పాడు. అయితే ఆమె ప్రియుడితో వెళ్లిపోయింది నిజమేనని ధృవీకరించుకున్న పోలీసులు.. మళ్లీ అతగాడ్ని తమైమదైన శైలిలో ప్రశ్నించగా నిజం బయటకు వచ్చింది. ఆకాంక్ష తాను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. హనుమంత్ విహార్‌లో ఓ గదిని అద్దెను తీసుకుని జీవించసాగింది. ఈ క్రమంలో.. ఆ యువకుడు మరో అమ్మాయితోనూ ప్రేమాయణం సాగిస్తున్నాడని తెలుసుకుని నిలదీసింది. తప్పు జరిగిపోయిందంటూ ఆమెను బతిమాలి కూల్ చేశాడా యువకుడు. అయినప్పటికీ మరో యువతితో అతని బంధం కొనసాగింది. ఈ క్రమంలో.. జరిగిన విషయాన్ని మరో గర్ల్‌ఫ్రెండ్‌కి చెప్పగా.. అకాంక్షను అడ్డు తొలగించుకుందాం అని సూచించింది. దీంతో.. సెప్టెంబర్ 8న రెస్టారెంట్లో ఆ జంట మధ్య గొడవ జరిగింది. కోపంతో ఇంటికి వచ్చిన అతను ఆమెను కొట్టి, అనంతరం గొంతు నలిపి హత్య చేశాడు. హత్య అనంతరం.. ఆమె శవాన్ని సూట్ కేసులో పెట్టి సెల్ఫీ తీసుకున్నాడు. ఆపై తన స్నేహితుడి సహాయంతో మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి మోటార్‌సైకిల్‌పై బండా జిల్లాకు తీసుకెళ్లారు. అక్కడ చిల్లా బ్రిడ్జి వద్ద యమునా నదిలో శవం ఉన్న సూట్ కేసు పడేశారు. ఆపై రెండో గర్ల్‌ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి.. ఆమెతో జాలీగా గడిపాడు.మొదట పోలీసులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన నిందితుడు.. మొబైల్ లొకేషన్, కాల్ రికార్డులతో దొరికిపోయాడు. దీంతో యువకుడిని, ఫతేపూర్‌కు చెందిన అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
భార్యను ముక్కలు చేసి.. సూట్‌కేసులో కుక్కి..
సాక్షి, బెంగళూరు: జీవిత భాగస్వామిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరకడం వంటి కిరాతక నేరాలు దేశంలో అక్కడక్కడా జరుగుతున్నాయి. అలాంటి ఘోరం బెంగళూరులోనూ చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి ముక్కలుగా ఖండించి సూట్‌కేసులో పెట్టి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని హుళిమావు పరిధిలోని దొడ్డకమ్మనహళ్లిలో జరిగింది.రెండేళ్ల కిందటే పెళ్లి.. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ (37) అనే వ్యక్తి తన భార్య గౌరి సాంబేకర్ (32)ను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి సూట్‌కేసులో నింపేశాడు. రెండేళ్ల క్రితం రాకేశ్, గౌరికి వివాహం జరిగింది. నెల రోజుల క్రితమే దొడ్డకమ్మనహళ్లిలోని ఇంటికి మారారు. ఇద్దరు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కింద ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్నారు... గురువారం ఏం జరిగిందో కానీ హత్య చేసి, మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన గౌరి తల్లిదండ్రులు తమ ఊళ్లోని సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారమిచ్చారు. ఆ పోలీసులు వెంటనే హుళిమావు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఇంటికి వెళ్లి తాళాలు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బాత్రూంలో సూట్‌కేసులో గౌరి మృతదేహం ముక్కలై కనిపించడంతో కంగుతిన్నారు. ఆమె హత్యకు ఇంకా కారణాలు తెలియరాలేదు. నిందితుడు రాకేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆగ్నేయ డీసీపీ సారా ఫాతిమా, క్లూస్ టీం చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
మాల్లో గుచ్చుకున్న మేకు.. రూ.75 కోట్ల పరిహారం
అమెరికాలో ఓ మహిళ షాపింగ్ కోసం వాల్‌మార్టు మాల్‌కు వెళ్లితే అనుకోని ప్రమాదం జరిగింది. ఆమె మాల్‌లోకి ప్రవేశించి షాపింగ్ చేస్తున్న సమయంలో కాలికి తుప్పుపట్టిన ఇనుప మేకు గుచ్చుకుంది. చిన్న గాయం కాస్త ఇన్ఫెక్షన్గా మారటంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ కాలును కోల్పోవటంతో ఆరేళ్లపాటు వీల్‌ఛైర్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఘటన 2015 సౌత్ కరోలినాలోని వాల్ మార్టులో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో బాధితురాలైన ఏప్రిల్ జోన్స్ అనే మహిళ 2017లో వాల్‌మార్టు యాజమాన్యంపై నష్టం పరిహారం కేసును ఫ్లోరెన్స్ కౌంటీలోని కోర్టులో దాఖలు చేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు 10 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని వాల్ మార్టును ఆదేశించింది. ఆమె తరఫున వాదనలు జరిపిన అనస్టోపౌలో న్యాయ సంస్థ న్యాయవాదులు.. ఏప్రిల్ జోన్స్ ఆరేళ్లపాటు వీల్ ఛైర్‌కే పరిమితమైందని, ఆమె జీవితం ఈ ఘటన ద్వారా చెల్లాచెదురై ఇబ్బందులు ఎదుర్కొందని కోర్టుకు వివరించారు. వారి వాదనలను సమర్ధిస్తూ బాధిత మహిళకు 10 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 75 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది. ఆమె ప్రొస్తెటిక్ కాలును కొనుగోలు చేయడానికి.. భవిష్యత్తు వైద్య బిల్లులను కవర్ చేయడానికి నష్టం పరిహారం డబ్బును ఉపయోగిస్తుందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ తీర్పుపై బాధితురాలు, ఆమె తరఫున వాదనలు వినిపించిన న్యాయసంస్థ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. -
సూట్ కేసులో మహిళ మృతదేహం
దుండిగల్: సూట్ కేసులో ఓ మహిళ అస్తి పంజరం లభ్యమైన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శంభీపూర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని కల్వర్ట్ వద్ద ఉన్న ఓ సూట్ కేసులో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సూట్ కేసును తెరిచి చూడగా అందులో ఓ మహిళ అస్తి పంజరం కనిపించింది. వారం రోజుల క్రితం సదరు మహిళను హత్య చేసి సూట్‌కేసులో తీసుకువచ్చి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నిటికీ సూట్ అవుతాయ్..!
ఇంటికి - ఒంటికి ఇంట్లో చాలా వస్తువులను పాడైనప్పుడు, వాటి అవసరం తీరాక పడేస్తూ ఉంటాం. కానీ కొన్నిటిని రీసైకిల్ చేసుకుంటే... ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో సూట్‌కేస్, ట్రంకు పెట్టెలు ముందు వరుసలో ఉంటాయి. కొన్ని సూట్‌కేసులను చిరిగిపోయాయనో, రంగు పాడైందనో పడేస్తుంటాం. కానీ ఒకసారి పక్కనున్న ఫొటోలను చూస్తే ఇకపై మీరు అలా చేయరులేండి. పాతబడిన సూట్‌కేసులకు రంగురంగుల కవర్లు తొడిగితే చాలు అవి కొత్తవాటిలా తళతళా మెరిసిపోతాయి. అప్పుడు అందులో మీ జ్యుయెలరీ (ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నెక్లేస్, చెయిన్స్, బ్రేస్లెట్స్...) పెట్టుకోవచ్చు. అలాగే వాటిలో మేకప్‌కు సంబంధించిన ప్రాడక్ట్స్‌ను కూడా దాచుకోవచ్చు. అంతేకాదు వైద్యానికి సంబంధించిన వస్తువులు (ఫస్ట్ ఎయిడ్ కిట్), చిన్న పిల్లల సామగ్రినీ అందులో పెట్టుకోవచ్చు. అలాగే పెట్ హౌజ్లా కూడా ఈ సూట్‌కేసులను ఉపయోగించుకోవచ్చు. మరీ పాడైపోయిన వాటినైతే పూలతొట్లలా మార్చి, అందులో మొక్కలు పెంచుకోవచ్చు. వాడుకున్న వాళ్లకు వాడుకున్నంత అన్నట్టు.. వాటిని టీ పాయ్, టేబుల్, చెయిర్, సోఫా.. ఇలా విరివిగా ఉపయోగించుకోవచ్చు. -
సూట్ కేసులో దుంగలు
రాజంపేట, న్యూస్‌లైన్ : ఎర్రచందనం దొంగలు స్మగ్లింగ్‌ను కొత్తపంథాల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కార్లు, లారీలు, స్కార్పియాలలో దుంగలు తరలిపోయేవి. అవి పట్టుబడుతున్నాయని..స్మగ్లర్లు కొత్తరూట్‌ను ఎంచుకున్నారు. సూట్ కేసుల్లో దుంగలను అమర్చి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం మన్నూరు పోలీసులకు రైల్వేకోడూరు చెందిన యువకుడు పట్టుబడిన ఉదంతం. ఎస్ఐ మధూసూదన్‌రెడ్డి కథనం మేరకు .. రాజంపేట పట్టణ శివార్లలో ఉన్న బోయనపల్లె ఇంజనీరింగ్ కళాశాల వద్ద వాహనాలను గురువారం రాత్రి మన్నూరు పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రైల్వేకోడూరుకు చెందిన సందీప్, రవి అనే యువకులు స్కూటర్లో సూట్‌కేసును పెట్టుకొని పోవడాన్ని గమనించారు. పోలీసులను గమనించి స్కూటరు, సూట్‌కేసును వదలి పరారయ్యారు. పోలీసులు వారిని వెంటాడి సందీప్‌ను పట్టుకున్నారు. రవి అని మరో యువకుడు తప్పించుకున్నాడు. వీరికి రైల్వేకోడూరు సమీపంలో దొరస్వామినాయుడు రూ.5వేలు ఆశచూపి, సూట్‌కేసులో ఉన్న దుంగలను కడపలో తాను చెప్పిన వ్యక్తికి అప్పగించాలని కోరారు. అందుకు ఒప్పుకున్న యువకులు చివరికి పోలీసులు పట్టుబడ్డారు. సందీప్ పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలావుండగా రోళ్లమడుగు వద్ద ఓ వ్యక్తి ప్లాస్టిక్ సంచిలో 11కేజీల బరువు కలిగిన దుంగను తీసుకుపోతుండగా రేంజర్ టీవైఎన్ గౌడ్ పట్టుకున్నారు. గుండ్లూరు చెక్‌పోస్టు వద్ద... గుండ్లూరు చెక్‌పోస్టు వద్ద లారీని తనిఖీ చేసి అందులో ఉన్న 70 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు రేంజర్ టీవైఎన్ గౌడ్ శుక్రవారం తెలిపారు. అలాగే డ్రైవర్ సయ్యద్ ముబారక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముబారక్ కర్నాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా ఊసకోట మండలానికి చెందిన వాడు.