సూట్ కేసులో మృతదేహం
దుండిగల్: సూట్ కేసులో ఓ మహిళ అస్తి పంజరం లభ్యమైన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శంభీపూర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని కల్వర్ట్ వద్ద ఉన్న ఓ సూట్ కేసులో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సూట్ కేసును తెరిచి చూడగా అందులో ఓ మహిళ అస్తి పంజరం కనిపించింది. వారం రోజుల క్రితం సదరు మహిళను హత్య చేసి సూట్‌కేసులో తీసుకువచ్చి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment