పెప్పర్ స్ప్రే చల్లి.. రూ.10 లక్షల ఆభరణాల చోరీ | Pepper spray used in jewelry robbery in krishna district | Sakshi
Sakshi News home page

పెప్పర్ స్ప్రే చల్లి.. రూ.10 లక్షల ఆభరణాల చోరీ

Published Tue, Mar 4 2014 3:21 AM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM

పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు అగంతకులు మహిళ కంట్లో పెప్పర్‌ స్ప్రే చల్లి రూ.10 లక్షల విలువైన ఆభరణాలు దోచుకున్నారు.

తిరువూరు, న్యూస్‌లైన్: పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు అగంతకులు మహిళ కంట్లో పెప్పర్‌ స్ప్రే చల్లి రూ.10 లక్షల విలువైన ఆభరణాలు దోచుకున్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తిరువూరులోని కూరగాయల మార్కెట్ పక్కన నివసిస్తున్న వ్యాపారి రాయల ప్రభాకరరావు ఇంట్లోకి ఉదయం 10 గంటల సమయంలో ఇద్దరు  యువకులు ప్రవేశించి ఆయన భార్య శకుంతలను మంచినీళ్లు అడిగారు.

నీరిచ్చేలోపు ఆ ఇద్దరూ తమతో తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేను ఆమె కళ్లల్లో చల్లి అరవకుండా నోట్లో దుస్తులు కుక్కారు. ఇంట్లోని బీరువాలో దాచిన బంగారు ఆభరణాలను అపహరించి క్షణాల్లో పరారయ్యారు. స్ప్రే ప్రభావంతో శకుంతలకు ఊపిరాడని పరిస్థితితో పాటు ముక్కునుంచి రక్తస్రావమైంది. ఈ ఘటనపై ప్రభాకరరావు ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసిన పోలీసులు మచిలీపట్నం నుంచి క్లూస్ టీంను రప్పించి నిందితుల ఆచూకీ కోసం  గాలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement