హోటల్లో రేప్‌ చేస్తారని భయపడ్డా: టీవీ స్టార్‌ | Kim Kardashian feared rape during Paris heist | Sakshi
Sakshi News home page

హోటల్లో రేప్‌ చేస్తారని భయపడ్డా: టీవీ స్టార్‌

Published Tue, Oct 4 2016 3:08 PM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM

హోటల్లో రేప్‌ చేస్తారని భయపడ్డా: టీవీ స్టార్‌ - Sakshi

హోటల్లో రేప్‌ చేస్తారని భయపడ్డా: టీవీ స్టార్‌

పారిస్‌లో తాను బస చేసిన హోటల్లోకి దుండుగులు చొరబడినపుడు భయంతో వణికిపోయానని రియాల్టీ టీవీ స్టార్‌ కిమ్‌ కర్దాషియన్‌ చెప్పింది. ఓ దుండగుడు తనను లాక్కెళ్లి బాత్‌టబ్‌లో బంధించాడని పోలీసులకు తెలిపింది. దీంతో దుండగులు తనపై లైంగికదాడి చేస్తారని బెదిరిపోయానని చెప్పింది. తనకు పిల్లలు ఉన్నారని, చంపవద్దని వారిని ప్రాధేయపడ్డానని, మీకు కావాల్సిన వస్తువులు తీసుకెళ్లి తనన వదిలేయమని వేడుకున్నానని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.

దుండగులు ఇంగ్లీష్‌లో మాట్లాడలేదని, ఫ్రెంచి భాషలో మాత్రమే మాట్లాడుకున్నారని కిమ్‌ తెలిపింది. తన భర్త ఇటీవల కానుకగా ఇచ్చిన ఉంగరం ఇవ్వాలని బెదిరించారని, తాను గట్టిగా ఏడ్చేసరికి నోటికి టేప్‌ అతికించారని చెప్పింది. ఆరు నిమిషాల్లో దొంగలు నగలు, డబ్బు దోచుకుని పారిపోయారని తెలిపింది. ఆ సమయంలో తన ఫ్రెండ్‌ సిమోనె కింది అంతస్తులో నిద్రిస్తోందని చెప్పింది. దొంగలు వెళ్లాక కేకలు వేయడంతో రెండు నిమిషాల తర్వాత తన అంగరక్షుడు వచ్చాడని వెల్లడించింది. కాగా దొంగలు తనకు ఎలాంటి హానీ చేయలేదని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె పారిస్‌ నుంచి వెళ్లిపోయింది. ఫ్రాన్స్‌ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున కిమ్ బస చేస్తున్న హోటల్ గదిలోకి ఇద్దరు దుండగులు చొరబడి.. ఆమెను తుపాకీతో బెదిరించి రూ.45 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement