Reality TV star Kim kardashian
-
కిమ్ కర్దాషియన్ క్రిప్టో వివాద సెటిల్మెంట్
న్యూయార్క్: క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేసిన వివాదానికి సంబంధించి అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ .. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ)తో సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇందుకోసం 1.26 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఆమె అంగీకరించారు. అలాగే మూడేళ్ల పాటు ఏ క్రిప్టో అసెట్నూ ప్రచారం చేయబోనని కిమ్ తెలిపారు. వివరాల్లోకి వెడితే, ఎథీరియంమ్యాక్స్ సంస్థకు సంబంధించిన ఈమ్యాక్స్ క్రిప్టోకరెన్సీని తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతా ద్వారా కిమ్ ప్రమోట్ చేశారు. అయితే, ఇందు కోసం ఆమె 2,50,000 డాలర్లు తీసుకున్న విషయాన్ని ఆమె వెల్లడించకపోవడం చట్టవిరుద్ధమని ఎస్ఈసీ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలోనే వివాదానికి ముగింపు పలికేందుకు కిమ్ కర్దాషియన్ సెటిల్మెంట్కు ముందుకొచ్చినట్లు ఆమె తరఫు లాయర్ వెల్లడించారు. -
37.31 కోట్ల బీమాకు టీవీ స్టార్ దరఖాస్తు
లాస్ ఏంజెలిస్: అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ 37.31 కోట్ల రూపాయల బీమా చెల్లించాలని కోరుతూ దరఖాస్తు చేసింది. ఇటీవల ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కిమ్ బస చేసిన హోటల్ గదిలోకి ఇద్దరు దుండగులు చొరబడి.. ఆమెను తుపాకీతో బెదిరించి కోట్ల విలువైన నగలను దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. కిమ్ ఈ నగలకు ఇన్సూరెన్స్ చేయించింది. కిమ్ వద్ద నుంచి దొంగలు దోచుకెళ్లిన నగల విలువ మొత్తం దాదాపు 70 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని మొదట్లో వార్తలు వచ్చాయి. కాగా వీటి విలువ 37.31 కోట్ల రూపాయలుగా కిమ్ వెల్లడించింది. దొంగలు కిమ్ నుంచి ఎంగేజ్మెంట్ రింగ్‌ను దోచుకెళ్లారు. ఈ డైమండ్ రింగ్‌ను కిమ్ భర్త ఆమెకు కానుకగా ఇచ్చాడు. దీని విలువ దాదాపు 24 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. -
హోటల్లో రేప్ చేస్తారని భయపడ్డా: టీవీ స్టార్
పారిస్‌లో తాను బస చేసిన హోటల్లోకి దుండుగులు చొరబడినపుడు భయంతో వణికిపోయానని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ చెప్పింది. ఓ దుండగుడు తనను లాక్కెళ్లి బాత్‌టబ్‌లో బంధించాడని పోలీసులకు తెలిపింది. దీంతో దుండగులు తనపై లైంగికదాడి చేస్తారని బెదిరిపోయానని చెప్పింది. తనకు పిల్లలు ఉన్నారని, చంపవద్దని వారిని ప్రాధేయపడ్డానని, మీకు కావాల్సిన వస్తువులు తీసుకెళ్లి తనన వదిలేయమని వేడుకున్నానని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దుండగులు ఇంగ్లీష్‌లో మాట్లాడలేదని, ఫ్రెంచి భాషలో మాత్రమే మాట్లాడుకున్నారని కిమ్ తెలిపింది. తన భర్త ఇటీవల కానుకగా ఇచ్చిన ఉంగరం ఇవ్వాలని బెదిరించారని, తాను గట్టిగా ఏడ్చేసరికి నోటికి టేప్ అతికించారని చెప్పింది. ఆరు నిమిషాల్లో దొంగలు నగలు, డబ్బు దోచుకుని పారిపోయారని తెలిపింది. ఆ సమయంలో తన ఫ్రెండ్ సిమోనె కింది అంతస్తులో నిద్రిస్తోందని చెప్పింది. దొంగలు వెళ్లాక కేకలు వేయడంతో రెండు నిమిషాల తర్వాత తన అంగరక్షుడు వచ్చాడని వెల్లడించింది. కాగా దొంగలు తనకు ఎలాంటి హానీ చేయలేదని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె పారిస్ నుంచి వెళ్లిపోయింది. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున కిమ్ బస చేస్తున్న హోటల్ గదిలోకి ఇద్దరు దుండగులు చొరబడి.. ఆమెను తుపాకీతో బెదిరించి రూ.45 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు. -
45 కోట్ల నగల దోపిడీ
-
45 కోట్ల నగల దోపిడీ
పారిస్: రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌కు పారిస్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఐదుగురు దుండగులు కిమ్‌ను తుపాకీతో బెదిరించి సుమారు రూ.45 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో (స్థానిక కాలమానం) కిమ్ బస చేస్తున్న హోటల్ గదిలోకి పోలీసు దుస్తుల్లో ఐదుగురు వ్యక్తులు చొరబడ్డారు. మొహానికి ముసుగులేసుకున్న ఆ దుండగులు.. కిమ్‌ను తుపాకీతో బెదిరించి రూ.45 కోట్ల (6.7 మిలియన్ డాలర్లు) విలువైన నగలతో ఉడాయించారు. ఘటనలో కిమ్‌కు ఎలాంటి హాని జరగలేదని, ఆమె క్షేమంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. న్యూయార్క్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన కిమ్ భర్త కాన్యే.. విషయం తెలియగానే పారిస్‌కు బయలుదేరారు.