37.31 కోట్ల బీమాకు టీవీ స్టార్‌ దరఖాస్తు | Kim Kardashian files $5.6 mn insurance claim | Sakshi
Sakshi News home page

37.31 కోట్ల బీమాకు టీవీ స్టార్‌ దరఖాస్తు

Published Sat, Oct 8 2016 5:21 PM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM

37.31 కోట్ల బీమాకు టీవీ స్టార్‌ దరఖాస్తు - Sakshi

37.31 కోట్ల బీమాకు టీవీ స్టార్‌ దరఖాస్తు

లాస్ ఏంజెలిస్: అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ 37.31 కోట్ల రూపాయల బీమా చెల్లించాలని కోరుతూ దరఖాస్తు చేసింది. ఇటీవల ఫ్రాన్స్‌ రాజధాని పారిస్లో కిమ్ బస చేసిన హోటల్ గదిలోకి ఇద్దరు దుండగులు చొరబడి.. ఆమెను తుపాకీతో బెదిరించి కోట్ల విలువైన నగలను దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. కిమ్ ఈ నగలకు ఇన్సూరెన్స్ చేయించింది.

కిమ్ వద్ద నుంచి దొంగలు దోచుకెళ్లిన నగల విలువ మొత్తం దాదాపు 70 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని మొదట్లో వార్తలు వచ్చాయి. కాగా వీటి విలువ 37.31 కోట్ల రూపాయలుగా కిమ్ వెల్లడించింది. దొంగలు కిమ్ నుంచి ఎంగేజ్మెంట్ రింగ్ను దోచుకెళ్లారు. ఈ డైమండ్ రింగ్ను కిమ్ భర్త ఆమెకు కానుకగా ఇచ్చాడు. దీని విలువ దాదాపు 24 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement