బంగారం బంద్.. రూ.2000 కోట్లు లాస్ | Strike on Gudi Padwa day cost jewellers Rs 2,000 crore | Sakshi
Sakshi News home page

బంగారం బంద్.. రూ.2000 కోట్లు లాస్

Published Sat, Apr 9 2016 2:17 PM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM

బంగారం బంద్.. రూ.2000 కోట్లు లాస్ - Sakshi

బంగారం బంద్.. రూ.2000 కోట్లు లాస్

కోల్ కత్తా:  కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలపై ఒక్క శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బంగారు వర్తకులు, బులియన్ ట్రేడర్స్ చేస్తున్న బంద్ వల్ల వారు శుక్రవారం ఒక్కరోజే రూ.2000 కోట్లు నష్టపోయారు.  గుడిపాడ్వ(ఉగాది) కావడం వల్ల సాధారణ రోజుల కంటే బంగార కొనుగోలుకు 15 శాతం ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే బంగారం వర్తకులు గత మార్చి 2 నుంచి చేస్తున్న నిరవధిక బంద్ వల్ల ఈ సారి ఉత్తర భారత్ లో బంగార దుకాణాలన్నీ మూతపడ్డాయి.

నాన్ సిల్వర్ జ్యువెలర్స్పై ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఎట్టి పరిస్థితుల్లో తాము సుంకాన్ని చెల్లించేది లేదంటూ జ్యువెల్లరీ కంపెనీలు వాదిస్తున్నాయి. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తమకు సమ్మతంగా లేదంటున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ పెంపు అనేది కేవలం జ్యువెల్లర్లకు, ప్రభుత్వానికే కాకుండా, రాజకీయ సెగ కూడా తగిలింది. కాంగ్రెస్, శివసేన, ఆప్ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఉత్తర భారత్ లో బంగారం దుకాణాలన్నీ మూతపడ్డాయని ఢిల్లీ జ్యువెల్లర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అశోక్ పొపాలియా తెలినారు. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో కూడా బంగారు షాపులు తెరవడం లేదన్నారు. గుడిపాడ్వ ఒక్కరోజే బంగార కొనుగోలు ఎక్కువగా ఉండవని, రెండు రోజుల పాటూ ఈ డిమాండ్ అధికంగా ఉంటుందని గీతాంజలి గ్రూప్ చైర్మన్ మెహుల్ చోక్సీ తెలిపారు. ఈ రెండు రోజుల్లో బంగారు వ్యాపారులు చాలా నష్టపోయామని వాపోయారు.

ఎక్సైజ్ డ్యూటీ పెంచడమనేది చాలా సంక్లిష్టమైన ధోరణి అని, ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తామన్న ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలన్నారు. అశోక్ లహరీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేస్తానన్న కేంద్రం, ఇప్పటివరకూ దానిపై చర్యలు తీసుకోలేదన్నారు. ఇలానే ఎక్కువ  రోజులు బంద్ కొనసాగితే, గోల్డ్ బిజినెస్ ఎక్కువగా నష్టపోతుందని వీహెచ్పీ జ్యువెల్లర్ల డైరెక్టర్ ఆదిత్య చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement