'ఏం చెప్పినా.. ఎక్సైజ్ డ్యూటీ మా వల్ల కాదు' | Jewellers strike against excise duty continues | Sakshi
Sakshi News home page

'ఏం చెప్పినా.. ఎక్సైజ్ డ్యూటీ మా వల్ల కాదు'

Apr 7 2016 5:38 PM | Updated on Aug 3 2018 3:04 PM

వెండియేతర ఆభరణాలపై ఎక్సైజ్ డ్యూటీని ఒక శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జ్యువెలర్లు, బులియన్ ట్రేడర్స్ చేస్తున్న బంద్ నిరవధింగా కొనసాగుతోంది.

ముంబై :వెండియేతర ఆభరణాలపై ఎక్సైజ్ డ్యూటీని ఒక శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జ్యువెలర్లు, బులియన్ ట్రేడర్స్ చేస్తున్న బంద్ నిరవధింగా కొనసాగుతోంది. కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీని తాము చెల్లించలేమంటూ వారు మరోసారి స్పష్టం చేశారు. నాన్ సిల్వర్ జ్యువెలర్స్పై ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన బడ్జెట్లో లో పేర్కొన్న విషయం తెలిసిందే.

దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత మార్చి 2 నుంచి వారు బంద్ చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ డ్యూటీని చెల్లించేది లేదంటూ జ్యువెల్లరీ కంపెనీలు వాదిస్తున్నాయి. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తమకు సమ్మతంగా లేదంటున్నాయి. అలాగే రూ.2 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు కల్గిన వ్యక్తులందరి దగ్గర పాన్ కార్డ్ కలిగి ఉండాలనే నిర్ణయాన్ని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. కాగా, వారు చేస్తున్న డిమాండ్ పై పరిశీలన జరిపేందుకు మాజీ చీఫ్ ఎకానమిక్ అడ్బయిజరీ అశోక్ లహరీ నేతృత్వంలో ప్రభుత్వం ఓ ప్యానెల్ ను ఏర్పాటుచేసింది. ఇది 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదక సమర్పిస్తుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement