సమ్మె ఆగదు: జువెలర్స్ | Jewellers, gold traders continue strike for 17th day | Sakshi
Sakshi News home page

సమ్మె ఆగదు: జువెలర్స్

Published Sat, Mar 19 2016 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

సమ్మె ఆగదు: జువెలర్స్

సమ్మె ఆగదు: జువెలర్స్

ముంబై: కేంద్ర ప్రభుత్వం 1 శాతం ఎక్సైజ్ సుంకం ప్రతిపాదనను వెనక్కు తీసుకునేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని జువెలర్స్ స్పష్టంచేశారు. తాము ఒకవేళ షాపులు తెరిస్తే.. ఎక్సైజ్ సుంకాన్ని సమతించినట్లేనని, అప్పుడు ఇన్‌స్పెక్టర్ రాజ్ విధానం మళ్లీ వచ్చినట్లువుతుందని తెలిపారు.

 సుంకం నుంచి చేతివృత్తుల వారు, కార్మికులు మినహాయింపు: ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఎక్సైజ్ సుంకం విధింపు నుంచి చేతివృత్తుల వారిని, కార్మికులను మినహాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది. వీరు రిజిస్ట్రేషన్, సుంకం చెల్లింపు, రిటర్న్ దాఖలు, అకౌంట్స్ రాయడం వంటి పనులు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. గురువారం జరిగిన రెవెన్యూ కార్యదర్శి, జువెలరీ పరిశ్రమ ప్రతినిధుల సమావేశపు నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement