Juvelars
-
సమ్మె ఆగదు: జువెలర్స్
ముంబై: కేంద్ర ప్రభుత్వం 1 శాతం ఎక్సైజ్ సుంకం ప్రతిపాదనను వెనక్కు తీసుకునేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని జువెలర్స్ స్పష్టంచేశారు. తాము ఒకవేళ షాపులు తెరిస్తే.. ఎక్సైజ్ సుంకాన్ని సమతించినట్లేనని, అప్పుడు ఇన్స్పెక్టర్ రాజ్ విధానం మళ్లీ వచ్చినట్లువుతుందని తెలిపారు. సుంకం నుంచి చేతివృత్తుల వారు, కార్మికులు మినహాయింపు: ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్సైజ్ సుంకం విధింపు నుంచి చేతివృత్తుల వారిని, కార్మికులను మినహాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది. వీరు రిజిస్ట్రేషన్, సుంకం చెల్లింపు, రిటర్న్ దాఖలు, అకౌంట్స్ రాయడం వంటి పనులు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. గురువారం జరిగిన రెవెన్యూ కార్యదర్శి, జువెలరీ పరిశ్రమ ప్రతినిధుల సమావేశపు నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
తొమ్మిదో రోజుకు చేరినజువెలర్స్ సమ్మె
పరిశ్రమకు రూ.60వేల కోట్లకు పైగా నష్టం! ముంబై: జువెలర్స్ నిరవధిక సమ్మె బుధవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరింది. దీంతో ఇప్పటిదాకా జువెలరీ పరిశ్రమకు రూ.60,000 కోట్లకు పైగా ఆదాయపు నష్టం వచ్చింటుందని అంచనా. తాజా బడ్జెట్లోని ఎక్సైజ్ సుంకం ప్రతిపాదనలను వెనక్కు తీసుకోవాలని జువెలరీ ట్రేడ్ సహా ఇతర అనుబంధ వ్యాపారాలకు సంబంధించిన దాదాపు 358 అసోసియేషన్స్‌కు చెందిన రిటైలర్లు, హోల్‌సెల్లర్స్, ఆభరణాల తయారీదారులు ఈ నెల 2 నుంచి నిరవధిక సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. అలాగే రూ.2 లక్షలు, అంతకు మించి విలువైన బంగారు ఆభరణాల కొనుగోలు లావాదేవీలకు పాన్ నిబంధన తప్పనిసరన్న కేంద్ర ప్రభుత్వ చర్యనూ వ్యతిరేకిస్తున్నారు. జెమ్స్ అండ్ జువెలరీ రంగపు రోజూవారీ ఆదాయం రూ.7,000 కోట్లు గా ఉంటుందని, ఈ ప్రతిపాదికన ఇప్పటిదాకా రూ.60,000 కోట్లకుపైగా నష్టం వచ్చింటుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) చైర్మన్ శ్రీధర్ తెలిపారు.