రుద్రమదేవి నగల కేసు ముమ్మర దర్యాప్తు | Police speed up enquiry of Rudramadevi jewellery stolen case | Sakshi
Sakshi News home page

రుద్రమదేవి నగల కేసు ముమ్మర దర్యాప్తు

Published Mon, Jul 21 2014 8:50 AM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM

రుద్రమదేవి నగల కేసు ముమ్మర దర్యాప్తు - Sakshi

రుద్రమదేవి నగల కేసు ముమ్మర దర్యాప్తు

హైదరాబాద్ : 'రాణి రుద్రమదేవి' సినిమా షూటింగ్లో మాయమైన నగల కేసు దర్యాప్తును గచ్చిబౌలి పోలీసులు ముమ్మరం చేశారు. కిలోన్నర నగలు మాయమయ్యాయని ఆ చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంగోపాల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నగలు అద్దెకు ఇచ్చిన చెన్నైకి చెందిన నాదెళ్ల ఆంజనేయశెట్టి కంపెనీ ప్రతినిధి రవి సుబ్రహ్మణ్యంతో పాటు మరొకరిని విచారిస్తున్నారు.

శనివారం షూటింగ్కు హాజరైన యూనిట్ సభ్యులతో పాటు ఇతరులను విచారిస్తున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు. రుద్రమదేవిగా నటిస్తున్న అనుష్క  రెండు మూడు రోజులుగా ఈ నగలు ధరించి షూటింగ్లో పాల్గొన్నారు. పోలీసులు నగల వీడియో క్లిప్పింగ్స్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement