బటన్స్‌తో భలేగా... | jewellery with Buttons! | Sakshi
Sakshi News home page

బటన్స్‌తో భలేగా...

Published Sun, Jul 17 2016 3:05 AM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM

బటన్స్‌తో భలేగా... - Sakshi

బటన్స్‌తో భలేగా...

ఇంటికి - ఒంటికి
మనకు ఎన్ని రకాల జ్యుయెలరీ ఉన్నా.. వేరే కొత్తరకం జ్యుయెలరీ ఏదైనా కనిపిస్తే వద్దంటామా? చాన్సే లేదు.. అంతే కాదు, మారుతున్న ఫ్యాషన్ డ్రెస్సుల మీదకు రకరకాల జ్యుయెలరీ వేసుకుంటేనే కదా మనకు తృప్తి. అలాంటి వారి కోసమే ఈ బటన్ జ్యుయెలరీ మేకింగ్. అవును! మన డ్రెస్సులకు ఉండే బటన్సే. పాడైపోయిన డ్రెస్సుల బటన్స్‌తో లేదా షాపుల్లో విడిగా దొరికే బటన్స్‌తో ఎంతో అందంగా.. ఎంతో సులువుగా జ్యుయెలరీని తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...
 
కావలసినవి: రంగురంగుల బటన్స్ (చిన్నవి, పెద్దవి), రంగురంగుల ఎలాస్టిక్ దారాలు (బ్రేస్‌లెట్ తయారీకి), సన్నని జంప్‌రింగ్స్, ఇయర్ రింగ్ హుక్స్, బ్రేస్‌లెట్ హుక్స్
 
తయారీ: ముందుగా బ్రేస్‌లెట్ కోసం... ఎలాస్టిక్ దారానికి రంగురంగుల బటన్స్‌ను ఎక్కించాలి (వాటికి ఉండే రంధ్రాల ద్వారా). ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించి, చివర్లకు బ్రేస్‌లెట్ హుక్ తగిలించాలి. అలాగే దారానికి బదులుగా సన్నని జంప్‌రింగ్స్‌ను కూడా వాడొచ్చు. అలాగే పెద్ద లేదా చిన్న సైజు బటన్స్‌కు జంప్‌రింగ్స్, హుక్స్ తగిలించి ఎంతో అందమైన ఇయర్ రింగ్స్‌ను తయారు చేసుకోవచ్చు.

అంతేకాదు, బ్రేస్‌లెట్ తయారీలాగే నెక్‌లేస్, కాళ్ల పట్టీలనూ తయారు చేసుకోవచ్చు. ఉంగరాలకు రంగు రాళ్లు పెట్టుకున్నట్ల్లు.. ఈ బటన్స్‌ను జోడిస్తే అవీ రెడీ అయినట్టే. అలాగే చీర పిన్నులకు చిన్న బటన్స్‌ను జంప్‌రింగ్స్ సాయంతో తగిలిస్తే, మ్యాచింగ్ పిన్ తయారవుతుంది. ఈ జ్యుయెలరీ మేకింగ్‌లో బటన్స్‌తో పాటు రంగురంగుల పూసలు జోడిస్తే.. అవి మరింత అందంగా మారతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement