Breslet
-
టేప్ తళుకులు
వారం వారం ఎన్నో రకాల మేడ్ ఇన్ హోమ్ జ్యుయెలరీని చూస్తున్నాం. మనకు సులువుగా దొరికే వాటితో... ఇయర్ రింగ్స్, నెక్లేస్, బ్రేస్లెట్ల తయారీని తెలుసుకుంటున్నాం. ఈసారి వెరైటీగా కనిపించే... అనిపించే జ్యుయెలరీని చూద్దాం. పక్కనున్న ఫొటోల్లో కనిపిస్తున్న జ్యుయెలరీ మొత్తం టేపులతో తయారు చేసినవే. ప్రస్తుతం షాపుల్లో ఇవి వివిధ డిజైన్లలో దొరుకుతున్నాయి. పెద్ద ఖర్చేమీ లేకుండా.. సులువుగా ఉంటుంది వీటి మేకింగ్. ఎలా అంటే.. కావలసినవి: రంగురంగుల టేపులు (డిజైన్స్‌తో ఉన్నవి), కత్తెర, ఇయర్ రింగ్ హుక్స్, ఓల్డ్ బ్యాంగిల్స్, ఓల్డ్ మెటల్ రింగ్స్ తయారీ: ముందుగా టేప్‌ను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఫోల్డ్ చేస్తూ, ఒకదానికొకటి అతికించి ఓల్డ్ రింగ్‌కు చుట్టాలి. అలాకాకుండా, ఫొటోలో కనిపిస్తున్నట్టు పూర్తిగా టేప్తోనే రింగ్స్ తయారు చేసుకోవచ్చు. మరి ఇయర్ రింగ్స్‌ను తయారు చేసుకోవాలంటే... టేప్ ముక్కలను తీసుకొని, కత్తెర సాయంతో పక్షి ఈకల్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వాటికి ఇయర్ రింగ్ హుక్స్ను తగిలించాలి. లేదా ఏదైనా అట్ట ముక్కను మీకు నచ్చిన షేపులో కట్ చేసి, ఈ టేప్‌ను అంటించి... వాటికి హుక్‌ను తగిలించాలి. ఏ డ్రెస్సు కలర్‌కు మ్యాచ్ అయ్యేలా ఆ రంగు టేప్‌తో వీటిని తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ టేప్‌ను డిజైన్‌గా కట్ చేసి మడిస్తే... చెయిన్‌కు లాకెట్గానూ మారిపోతుంది. అంతేకాదు... ఓల్డ్ బ్యాంగిల్స్‌కు కలర్‌ఫుల్ టేపులను చుడితే... అవి కొత్త గాజుల్లా మెరిసిపోతాయి. అలాగే పొడవు టేపును ఫోల్డ్ చేస్తూ... పూసలు గుచ్చితే అందమైన బ్రేస్లెట్ రెడీ అవుతుంది. ఇదే పద్ధతిలో చెయిన్లనూ తయారు చేసుకోవచ్చు. -
బటన్స్‌తో భలేగా...
ఇంటికి - ఒంటికి మనకు ఎన్ని రకాల జ్యుయెలరీ ఉన్నా.. వేరే కొత్తరకం జ్యుయెలరీ ఏదైనా కనిపిస్తే వద్దంటామా? చాన్సే లేదు.. అంతే కాదు, మారుతున్న ఫ్యాషన్ డ్రెస్సుల మీదకు రకరకాల జ్యుయెలరీ వేసుకుంటేనే కదా మనకు తృప్తి. అలాంటి వారి కోసమే ఈ బటన్ జ్యుయెలరీ మేకింగ్. అవును! మన డ్రెస్సులకు ఉండే బటన్సే. పాడైపోయిన డ్రెస్సుల బటన్స్‌తో లేదా షాపుల్లో విడిగా దొరికే బటన్స్‌తో ఎంతో అందంగా.. ఎంతో సులువుగా జ్యుయెలరీని తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం... కావలసినవి: రంగురంగుల బటన్స్ (చిన్నవి, పెద్దవి), రంగురంగుల ఎలాస్టిక్ దారాలు (బ్రేస్లెట్ తయారీకి), సన్నని జంప్‌రింగ్స్, ఇయర్ రింగ్ హుక్స్, బ్రేస్లెట్ హుక్స్ తయారీ: ముందుగా బ్రేస్లెట్ కోసం... ఎలాస్టిక్ దారానికి రంగురంగుల బటన్స్‌ను ఎక్కించాలి (వాటికి ఉండే రంధ్రాల ద్వారా). ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించి, చివర్లకు బ్రేస్లెట్ హుక్ తగిలించాలి. అలాగే దారానికి బదులుగా సన్నని జంప్రింగ్స్ను కూడా వాడొచ్చు. అలాగే పెద్ద లేదా చిన్న సైజు బటన్స్‌కు జంప్‌రింగ్స్, హుక్స్ తగిలించి ఎంతో అందమైన ఇయర్ రింగ్స్‌ను తయారు చేసుకోవచ్చు. అంతేకాదు, బ్రేస్లెట్ తయారీలాగే నెక్లేస్, కాళ్ల పట్టీలనూ తయారు చేసుకోవచ్చు. ఉంగరాలకు రంగు రాళ్లు పెట్టుకున్నట్ల్లు.. ఈ బటన్స్‌ను జోడిస్తే అవీ రెడీ అయినట్టే. అలాగే చీర పిన్నులకు చిన్న బటన్స్‌ను జంప్‌రింగ్స్ సాయంతో తగిలిస్తే, మ్యాచింగ్ పిన్ తయారవుతుంది. ఈ జ్యుయెలరీ మేకింగ్‌లో బటన్స్‌తో పాటు రంగురంగుల పూసలు జోడిస్తే.. అవి మరింత అందంగా మారతాయి. -
నీ బెల్ట్ బంగారం కానూ!
న్యూలుక్ జీన్స్, మిడీస్, ఫ్రాక్స్.. మీదకు అమ్మాయిలు క్లాత్, లెదర్ బెల్ట్‌లను ఉపయోగిస్తుంటారు. అలాగే చేతి గడియారం బెల్ట్‌లు, చిన్నా, పెద్ద చాలా రకాల మోడల్ బెల్ట్‌లు ఉండే ఉంటాయి. కొన్ని పాతవైపోయి, ఇంకొన్ని వాడకుండా వదిలేసినవీ ఉంటాయి. వీటితో ఏమిటి చేయడం అని ఎప్పుడూ ఆలోచించి ఉండరు. బెల్ట్‌తో బ్రేస్లెట్, అందమైన లాకెట్లను డిజైన్ చేసి ధరిస్తే... చూసినవారు నీ బెల్ట్ బంగారం కానూ! అని మెచ్చుకోకుండా ఉండలేరు. * ఫ్యాషన్ జువెల్రీలో ఎన్నో మోడల్స్ వస్తున్నాయి. వాటిలో బెల్ట్‌తో రీ డిజైన్ చేసుకున్న వీటిని చేర్చండి. * స్టీల్, సిల్వర్ చైన్‌కు బెల్ట్ బకెల్ను లాకెట్‌గా వాడుకోవచ్చు. ఇందుకు చేయాల్సింది కొంత మీ నైపుణ్యం. బకెల్‌కు స్టోన్స్, పూసలు జత చేసి ఇంకా అందంగా రూపొందించుకోవచ్చు. * ఎరుపు, ముదురు ఎరుపు, ఖాఖీ రంగు బెల్టులను ముంజేతికి ఎంచక్కని కఫ్స్గా తయారుచేసుకోవచ్చు. వీటికి అక్కడక్కడా కొన్ని గోల్డెన్ బటన్స్‌ని అమర్చితే అందమైన బ్రేస్లెట్స్ రెడీ. * జీన్ ప్యాంట్ కాలు భాగాన్ని కట్ చేసి, దానికి బెల్ట్‌ని ఇలా జత చేస్తే అందమైన బ్యాగ్ మీ చేతుల్లో. * వెస్ట్రన్ డ్రెస్‌ల మీదకు అందంగా నప్పే పొడవైన కంఠాభరణం ఇలా మీ చేతుల్లో... * ఒక పాత బెల్ట్.. కొన్ని చైన్ల కలబోతతో తయారుచేసిందంటే ఎవరూ నమ్మరు. * బెల్ట్‌ని సన్నని పీలికలుగా కట్ చేసి రెండు మూడు వరసలుగా అమర్చి ఒక బ్రేస్లెట్, జడలా అల్లి మరో బ్రెస్లెట్... ఇలా మీకు నచ్చిన డిజైన్స్‌ను సృష్టించి, ధరించవచ్చు.