నీ బెల్ట్ బంగారం కానూ!
న్యూలుక్
జీన్స్, మిడీస్, ఫ్రాక్స్.. మీదకు అమ్మాయిలు క్లాత్, లెదర్ బెల్ట్‌లను ఉపయోగిస్తుంటారు. అలాగే చేతి గడియారం బెల్ట్‌లు, చిన్నా, పెద్ద చాలా రకాల మోడల్ బెల్ట్‌లు ఉండే ఉంటాయి. కొన్ని పాతవైపోయి, ఇంకొన్ని వాడకుండా వదిలేసినవీ ఉంటాయి. వీటితో ఏమిటి చేయడం అని ఎప్పుడూ ఆలోచించి ఉండరు. బెల్ట్‌తో బ్రేస్‌లెట్, అందమైన లాకెట్‌లను డిజైన్ చేసి ధరిస్తే... చూసినవారు నీ బెల్ట్ బంగారం కానూ! అని మెచ్చుకోకుండా ఉండలేరు.
* ఫ్యాషన్ జువెల్రీలో ఎన్నో మోడల్స్ వస్తున్నాయి. వాటిలో బెల్ట్‌తో రీ డిజైన్ చేసుకున్న వీటిని చేర్చండి.
* స్టీల్, సిల్వర్ చైన్‌కు బెల్ట్ బకెల్‌ను లాకెట్‌గా వాడుకోవచ్చు. ఇందుకు చేయాల్సింది కొంత మీ నైపుణ్యం. బకెల్‌కు స్టోన్స్, పూసలు జత చేసి ఇంకా అందంగా రూపొందించుకోవచ్చు.
* ఎరుపు, ముదురు ఎరుపు, ఖాఖీ రంగు బెల్టులను ముంజేతికి ఎంచక్కని కఫ్స్‌గా తయారుచేసుకోవచ్చు. వీటికి అక్కడక్కడా కొన్ని గోల్డెన్ బటన్స్‌ని అమర్చితే అందమైన బ్రేస్‌లెట్స్ రెడీ.
* జీన్ ప్యాంట్ కాలు భాగాన్ని కట్ చేసి, దానికి బెల్ట్‌ని ఇలా జత చేస్తే అందమైన బ్యాగ్ మీ చేతుల్లో.
* వెస్ట్రన్ డ్రెస్‌ల మీదకు అందంగా నప్పే పొడవైన కంఠాభరణం ఇలా మీ చేతుల్లో...
* ఒక పాత బెల్ట్.. కొన్ని చైన్‌ల కలబోతతో తయారుచేసిందంటే ఎవరూ నమ్మరు.
* బెల్ట్‌ని సన్నని పీలికలుగా కట్ చేసి రెండు మూడు వరసలుగా అమర్చి ఒక బ్రేస్‌లెట్, జడలా అల్లి మరో బ్రెస్‌లెట్... ఇలా మీకు నచ్చిన డిజైన్స్‌ను సృష్టించి, ధరించవచ్చు.